PGCIL Recruitment 2023: Apply for 1045 Apprentice
Posts – Details Here
పవర్ గ్రిడ్
కార్పొరేషన్లో 1045 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు - స్టైపెండ్: నెలకు రూ.13,500 నుంచి రూ.17,500.
=========================
హరియాణా
రాష్ట్రం గుడ్గావ్లోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
(పీజీసీఐఎల్)... 2023-24 సంవత్సరానికి దేశవ్యాప్తంగా
ఉన్న పీజీసీఐఎల్ రీజియన్లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల
చేసింది. అర్హులైన అభ్యర్థులు జులై 31లోగా ఆన్లైన్
దరఖాస్తు చేసుకోవాలి.
పీజీసీఐఎల్
రీజియన్ వారీగా ఖాళీలు:
1. కార్పొరేట్ సెంటర్ (గుడ్గావ్)- 53
2. నార్తర్న్ రీజియన్-1 (ఫరీదాబాద్) - 135
3. నార్తర్న్ రీజియన్-2 (జమ్ము) - 79
4. నార్తర్న్ రీజియన్-III (లఖ్నవూ)- 93
5. ఈస్ట్రన్ రీజియన్-1 (పట్నా) - 70
6. ఈస్ట్రన్ రీజియన్-2 (కోల్కతా) – 67
7. నార్త్ ఈస్ట్రన్ రీజియన్ (షిల్లాంగ్) - 115
8. ఒడిశాప్రాజెక్ట్స్ (భువనేశ్వర్) - 47
9. వెస్ట్రన్ రీజియన్-1 (నాగ్ పూర్) - 105
10. వెస్ట్రన్ రీజియన్-2 (వడోదర) - 106
11. సదరన్ రీజియన్-1 (హైదరాబాద్)- 70
12. సదరన్ రీజియన్-2 (బెంగళూరు)- 105
మొత్తం ఖాళీల
సంఖ్య: 1045.
అప్రెంటిషిప్
ట్రేడ్ విభాగాలు: గ్రాడ్యుయేట్ (ఎలక్ట్రికల్), గ్రాడ్యుయేట్
(కంప్యూటర్ సైన్స్), గ్రాడ్యుయేట్
(ఎలక్ట్రానిక్స్/ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్), హెచార్ ఎగ్జిక్యూటివ్, సీఎస్ఆర్
ఎగ్జిక్యూటివ్, పీఆర్ అసిస్టెంట్, ఐటీఐ - ఎలక్ట్రిషియన్, డిప్లొమా
(ఎలక్ట్రికల్), డిప్లొమా (సివిల్), గ్రాడ్యుయేట్ (సివిల్), లా
ఎగ్జిక్యూటివ్, సెక్రటేరియల్ అసిస్టెంట్.
అర్హత:
విభాగాన్ని అనుసరించి పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎలీల్బీ, ఎంబీఏ ఉత్తీర్ణులై
ఉండాలి.
కనిష్ఠ వయసు:
18 ఏళ్లు నిండి ఉండాలి.
శిక్షణ
వ్యవధి: ఏడాది.
స్టైపెండ్:
విభాగాన్ని అనుసరించి నెలకు రూ.13,500 నుంచి రూ.17,500.
ఎంపిక
ప్రక్రియ: అకడమిక్ మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన
ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్లైన్
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 01-07-2023.
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 31-07-2023.
=========================
0 Komentar