Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS - DSC 2023: All the Details

 

TS - DSC 2023: All the Details

టీఎస్:  డీఎస్సీ 2023 – పూర్తి వివరాలు ఇవే

========================

UPDATE 13-10-2023

TS - DSC 2023: పరీక్షలు వాయిదా వివరాలు ఇవే

అసెంబ్లీ ఎన్నికల నేపధ్యం లో తెలంగాణ ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ) వాయిదా వేస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన తెలిపారు. టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ)లో భాగమైన సెకండరీ గ్రేడ్ టీచర్స్(ఎస్ఓటీ) పరీక్షలు వాయిదా పడ్డాయి.

మొత్తం 5,089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నవంబరు 20 నుంచి 30 వరకు టీఆర్టీ నిర్వహణకు ఇప్పటికే షెడ్యూలు ప్రకటించిన సంగతి తెలిసిందే. నవంబరు 30న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎస్ఓటీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది.

WEBSITE

========================

REGISTRATION & PAYMENT

APPLICATION

KNOW PAYMENT STATUS

INFORMATION BULLETIN

WEBSITE

TS DSC - 2023 - District Wise Direct Recruitment Vacancy 👇

CLICK HERE

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 20-09-2023

ఆన్‌లైన్ ఫీజు చెల్లింపును సమర్పించడానికి చివరి తేదీ: 27-10-2023

దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 21-10-202328-10-2023    

పరీక్షల తేదీలు: 20-11-2023 నుండి 30-11-2023 వరకు  

========================

తెలంగాణ రాష్ట్రంలో 5,089 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ / టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ) నోటిఫికేషన్ విడుదలైంది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి జిల్లాల వారీగా ఖాళీలు, ఇతర వివరాలన్నీ సెప్టెంబరు 15 నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు విద్యాశాఖ పేర్కొంది. సెప్టెంబరు 20 నుంచి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్టోబర్ 21 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. నవంబర్ 20 నుంచి 30వరకు సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నోటిఫికేషన్లో 1,523 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల ఖాళీల భర్తీ గురించి ప్రస్తావించలేదు.

డీఎస్సీ / టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ): 5,089 పోస్టులు

ఖాళీలు: మొత్తం 5,089 ఖాళీల్లో ఎస్టీ- 2,575 పోస్టులు; స్కూల్ అసిస్టెంట్- 1,739 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్- 611 పోస్టులు, పీఈటీ- 164 పోస్టులు ఉన్నాయి.

డీఎస్సీ ద్వారానే ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టుల్లో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 358, నిజామాబాద్ జిల్లాలో 309 ఖాళీలున్నాయి. పెద్దపల్లి జిల్లాలో అతి తక్కువగా 43, హనుమకొండలో 53 ఖాళీలు ఉన్నాయి. పాత ఉమ్మడి జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

అర్హతలు: పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, డీఎడ్, బీఈడీ, టెట్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని 44 ఏళ్లుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అయిదేళ్ల వయోసడలింపు వర్తిస్తుంది. దివ్యాంగులకు పదేళ్ల వయోసడలింపు ఉంటుంది.

పరీక్ష కేంద్రాలు: మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డి.

దరఖాస్తు రుసుం: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.

========================

జిల్లాల వారీ ఖాళీల వివరాలు ఇవే

DOWNLOAD HERE

========================

The Telangana Direct Recruitment for the posts of Teachers (Scheme of Selection) Rules, 2023 – Notification – Orders – Issued.

School Education (Ser.III) Department

G.O.Ms.No.25, Date: 05.09.2023

========================

DOWNLOAD G.O.25 WITH ALL DETAILS

SCHOOL EDU WEBSITE

========================

REFERENCE:

TS: Filling up 5,089 Vacant Teacher Posts - Direct Recruitment through Departmental Selection Committee (DSC) – G.O Released

జిల్లాల వారీగా & డిపార్ట్మెంటల్ వారీగా ఖాళీల వివరాలు ఇవే

CLICK HERE

========================

Previous
Next Post »
0 Komentar

Google Tags