Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

US Open Men’s Final 2023: Novak Djokovic Beats Daniil Medvedev to Equal Open Era Slam Singles Titles Record

 

US Open Men’s Final 2023: Novak Djokovic Beats Daniil Medvedev to Equal Open Era Slam Singles Titles Record

US ఓపెన్ పురుషుల ఫైనల్ 2023: గ్రాండ్ స్లామ్ రికార్డు – 24 వ గ్రాండ్ స్లామ్ సాధించిన నోవాక్ జకోవిచ్

=======================

టెన్నిస్ గ్రాండ్ స్లామ్ రికార్డు లు మరో కొత్త రికార్డు నమోదు అయ్యింది. పురుషుల సింగిల్స్ ఇప్పటికే అత్యధిక టైటిల్స్ సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించిన సెర్బియన్ స్టార్ ఆటగాడు నోవాక్ జకోవిచ్ తాజాగా మరో రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. యుఎస్ ఓపెన్ ఫైనల్లో రష్యా ఆటగాడు మెద్వెదెవ్ ను చిత్తుచేసి 24వ టైటిల్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో టెన్నిస్ లో ఓవరాల్ గా అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిళ్లు నెగ్గిన మార్గరెట్ కోర్ట్ (24)ను సమం చేశాడు.

ఫైనల్ ఫోరు హోరాహోరీగా సాగుతుందని భావించినప్పటికీ 6-3, 7-6(7-5), 6-3 తేడాతో జకోవిచ్ వరుస సెట్లలో మూడో సీడ్ ఆటగాడు మెద్వెదెవ్ ను ఓడించి ఛాంపియన్ గా నిలిచాడు. 2021లో ఇదే యూఎస్ ఓపెన్ ఫైనల్లో జకోవిచ్ ను ఓడించి తొలిసారిగా గ్రాండ్లమ్ను ఒడిసిపట్టిన మెద్వెదేవ్ ఈ సారి మాత్రం బోల్తా పడ్డాడు. ఈ విజయంతో జకోవిచ్ ప్రతీకారం తీర్చుకున్నట్లు అయింది.


తొలి సెట్లో 6-3 తేడాతో చిత్తుచేసిన జకోకు రెండో సెట్ లో డానిల్ మెద్వెదేవ్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఒకానొక సమయంలో రెండో సెట్ ను మెద్వెదేవ్ గెలిచే విధంగా కనిపించాడు. అయితే అనూహ్యంగా పుంజుకున్న జకో ప్రత్యర్థితో పోటీ పడడంతో స్కోర్ 6-6 సమం అయింది. ఈ దశలో అద్భుతంగా ఆడిన జకో 7- 6 తేడాతో రెండో సెట్ ను కైవసం చేసుకున్నాడు. ఇక కీలక మూడో సెట్లో మెద్వెదేవ్ తేలిపోయాడు. దీంతో జకోవిచ్ 6-3 తేడాతో ఓడించి టైటిల్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. మూడు గంటల 17 నిమిషాల పాటు పాటు ఈ మ్యాచ్ సాగింది. ఈ ఏడాది నాలుగు గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ కి వెళ్లిన జకో ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, తాజాగో యుఎస్ ఓపెన్ విజయం సాధించాడు. వింబుల్డన్ లో మాత్రం యువ ఆటగాడు కార్లోస్ అల్కరాస్ చేతిలో ఓటమి పాలయ్యాడు.

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags