Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP TET-2024 - Guidelines for Conducting AP TET - Amendment Orders – G.O- Released

 

AP TET-2024 - Guidelines for Conducting AP TET - Amendment Orders – G.O- Released

===================

టెట్ పేపర్-1కు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ వారే అర్హులు - అర్హతలు సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) రాసేందుకు అర్హతలను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకటి నుంచి 5 తరగతులకు బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ)కు నిర్వహించే టెట్-1 పేపర్లు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్ఈడీ), నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (బీఈఎల్ఈడీ) చేసిన వారే అర్హులని పేర్కొంది. ఓసీ లకు ఇంటర్మీడియట్, తత్సమాన విద్యార్హతలో 50శాతం మార్కులు ఉండాలనే నిబంధన పెట్టింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 5% మినహాయింపునిచ్చి.. 45% మార్కులు ఉండాలని పేర్కొంది.

ఎస్జీటీ పోస్టులకు బీఈడీ చేసిన వారు అర్హులేనంటూ జాతీయ ఉపా ధ్యాయ విద్యామండలి 2018లో ఇచ్చిన నోటిఫికేషన్ ను సుప్రీంకోర్టు రద్దు చేసినందున ఈ సవరణ ఉత్తర్వులు ఇచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. టెట్ నిర్వహణవ్యయాన్ని అభ్యర్థుల దరఖాస్తు ఫీజుల నుంచే భరించా లని సూచించింది. వైకాపా ప్రభుత్వం వచ్చాక 2022లో ఒకసారి టెట్ నిర్వహించింది. గతంలో ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహించాలనే నిబంధన ఉండగా.. ఒక్క సారే నిర్వహించాలని 2021లో జగన్ సర్కార్ దాన్ని సవరించింది.

===================

School Education - Guidelines for conducting Andhra Pradesh State Teacher Eligibility Test (AP TET) under the Right of Children to Free and Compulsory Education Act (RTE), 2009 - Amendment Orders - Issued.

SCHOOL EDUCATION (SERVICES.I) DEPARTMENT

G.O.Ms.No:4, Dated: 26.01.2024

===================

DOWNLOAD G.O.4

===================

AP TET- 2024 - Minimum Qualifying Marks for Paper-II A - Proceedings - Memo.No.1331600 /Services-I/A1/2023, Dated:26.01.2024

CLICK HERE

===================

Previous
Next Post »
0 Komentar

Google Tags