Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Australian Open-2024: Sabalenka Defends Women’s Singles AO Title

 

Australian Open-2024: Sabalenka Defends Women’s Singles AO Title

ఆస్ట్రేలియన్ ఓపెన్-2024: మహిళల సింగిల్స్ విజేత అరీనా సబలెంక – ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ ను వరుసగా రెండోసారి దక్కించుకున్న తొలి మహిళా ప్లేయర్ గా రికార్డు

====================

అరినా సబలెంక ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగి విజేతగా నిలిచింది. ఫైనల్లో చైనా క్రీడాకారిణి జెంగ్ కిన్వెన్పై సబలెంక 6-3, 6-2 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది. తొలి సెట్లో కాస్త పోరాడిన జెంగ్.. ఆ తర్వాత చేతులెత్తేసింది. 2013 నుంచి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ను వరుసగా రెండోసారి దక్కించుకున్న తొలి మహిళా ప్లేయర్ గా రికార్డు సృష్టించింది.

లీ నా తర్వాత పదేళ్లలో తొలిసారి గ్రాండ్లమ్ ఫైనల్ ఆడుతున్న తొలి చైనా అమ్మాయిగా ఇప్పటికే ఘనత సాధించిన 21 ఏళ్ల జెంగ్.. తుదిపోరులో మాత్రం సబలెంకకు ఎదురు నిలవలేకపోయింది. ఇక టెన్నిస్ స్టార్ సెరెనా తర్వాత వరుసగా రెండోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్కు చేరిన ప్లేయర్ సబలెంక కావడం విశేషం. ఇప్పుడు ఆమె విజేతగా నిలిచింది.

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags