Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Padma Awards 2025: Nomination Process Started for the Public - Details Here

 

Padma Awards 2025: Nomination Process Started for the Public - Details Here

పద్మ అవార్డుల కోసం నామినేషన్లు పంపాలని ప్రజలకు కేంద్రం విజ్ఞప్తినామినేషన్ల పోర్టల్ లింక్ ఇదే

========================

ప్రతిభావంతులను గుర్తించి పద్మ అవార్డులకు అర్హులైన వారి పేర్లను సిఫార్సు చేయాలని కేంద్రం బుధవారం (మే 1) ప్రజలకు విజ్ఞప్తి చేసింది. వచ్చే ఏడాది జరిగే గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రకటించే ఈ పురస్కారాల కోసం ఆన్లైన్లో నామినేషన్లు, సిఫార్సుల స్వీకరణ ప్రక్రియ సోమవారం నుంచి తెరుచుకున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబరు 15లోగా ప్రతిపాదనలను పంపొచ్చని పేర్కొంది.

స్వీయ నామినేషన్లు కూడా పంపొచ్చని తెలిపింది. ఈ అవార్డుల్లో పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ పురస్కారాలు ఉంటాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏటా వీటిని ప్రకటిస్తుంటారు. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్, ఇంజినీరింగ్, పౌర సేవల, వాణిజ్యం, పరిశ్రమలు తదితర రంగాల్లో అసాధారణ కృషి చేసినవారిని గుర్తించడం ఈ అవార్డుల ఉద్దేశమని కేంద్రం తెలిపింది.

నామినేషన్ ప్రారంభ తేదీ: 01/05/2024

నామినేషన్ ముగింపు తేదీ: 15/09/2024

========================

APPLY OR NOMINATE

WEBSITE

========================

Previous
Next Post »
0 Komentar

Google Tags