SBI Alert for Customers: Rewards Fraud Asks
Customers Not to Click on Links – Details Here
ఎస్బీఐ రివార్డ్స్
పేరిట వాట్సప్ సందేశాలు & ఎసెమ్మెస్ ల గురించి ఎస్బీఐ హెచ్చరిక – వివరాలు ఇవే
======================
ఎస్బీఐ రివార్డ్స్
పేరిట వాట్సప్ సందేశాలు & సాధారణ ఎసెమ్మెస్ ల రూపంలోనూ మోసపూరిత లింకులు
వస్తున్నాయి. వాటిపై క్లిక్ చేసి పలువురు నష్టపోయిన ఘటనలూ వెలుగులోకి వచ్చాయి. ఈ
నేపథ్యంలో ఎస్బీఐ తమ కస్టమర్లను అప్రమత్తం చేసింది.
ఎస్బీఐ పేరిట
వాట్సప్ లో రివార్డ్స్ (SBI Rewardz) లింకు విస్తృతంగా
ప్రచారమవుతోంది. తెలిసిన నంబర్ల నుంచే వస్తుండటంతో దాన్ని చూసినవారు నిజమని
నమ్ముతున్నారు. ఫలితంగా సులభంగా మోసపోతున్నారు. 'మీ ఎస్బీఐ రివార్డ్ రూ.7,250 యాక్టివేట్ అయింది.
దీని గడువు ఈరోజుతో ముగిసిపోతుంది. డబ్బులు పొందేందుకు ఎస్బీఐ రివార్డ్స్ యాప్
ఇన్స్టాల్ చేసుకోండి. తద్వారా మీ ఖాతాలో డబ్బులు జమ చేసుకోండి' అంటూ సందేశంలో పేర్కొంటున్నారు. ఎస్బీఐ యోనో పేరిట ఓ
లింకును సైతం జత చేస్తున్నారు.
ఎస్బీఐ వివరణ:
తమ బ్యాంకు
రివార్డ్ పాయింట్ల పేరుతో జరుగుతున్న సైబర్ నేరాలపై ఎస్బీఐ (SBI) స్పందించింది. రివార్డు పాయింట్ల విషయంలో తాము ఎలాంటి
లింకులు పంపబోమని స్పష్టం చేసింది. ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవాలని కోరబోమని
తెలిపింది. ఇలా వాట్సప్, ఎసెమ్మెస్ వచ్చే
ఎలాంటి లింకులను క్లిక్ చేయొద్దని హెచ్చరించింది. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని
సూచించింది.
======================
Your safety is our top priority.
— State Bank of India (@TheOfficialSBI) May 18, 2024
Here is an important message for all our esteemed customers!#SBI #TheBankerToEveryIndian #StaySafe #StayVigilant #FraudAlert #ThinkBeforeYouClick pic.twitter.com/CXiMC5uAO8
0 Komentar