AP Cabinet Meeting
Highlights – 20/05/2025
ఏపీ
క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే – 20/05/2025
===================
Cabinet Decisions -
Press Briefing by Sri. Kolusu Parthasarathy, Hon'ble Minister for Information
and Public Relations, Housing and Sri. Nadendla Manohar, Food and Civil
Supplies, Consumer Affairs at Publicity Cell, Block - 04, AP Secretariat on
20-05-2025 LIVE
ఏపీ
క్యాబినెట్ మీటింగ్ గురించి మంత్రుల ప్రెస్ మీట్ ప్రత్యక్ష ప్రసార వివరాలు ఇవే
YouTube Link:
https://www.youtube.com/watch?v=o2_mEsXsnis
===================
ఏపీ
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా
కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను సమావేశం అనంతరం మంత్రులు ప్రెస్ మీట్ లో
వివరించారు.
కేబినెట్
నిర్ణయాలు ఇవే:
> సౌర
విద్యుత్, పవన విద్యుత్
ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం. త్వరలోనే విద్యుత్ ఇంధన వనరుల కేంద్రంగా మారనున్న
అనంతపురం.
> వివిధ
పర్యాటక ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం - టూరిజం పాలసీకి
అనుగుణంగానే వీరికి ప్రోత్సాహకాలు.
> డైకిన్
ఏసీ తయారీ సంస్థకు శ్రీసిటీలో విస్తరణకు అనుమతి.
> ప్రాజెక్టు
వయబిలిటి దృష్టిలో ఉంచుకొని తిరిగి 500 ఎకరాలు కేటాయింపు.
> అమరావతిలో
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా న్యాయ విశ్వ విద్యాలయం ఏర్పాటు చేసే ప్రతిపాదనకు
కేబినెట్ ఆమోదం. 20 శాతం సీట్లు ఏపీ
విద్యార్థులకు కేటాయించేలా రిజర్వేషన్.
> అంబేడ్కర్
ఓపెన్ యూనివర్సిటీని ఏలూరు వద్ద ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం.
> పొట్టి
శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రధాన కేంద్రాన్ని రాజమహేంద్రవరంలో ఏర్పాటు
చేసేందుకు కేబినెట్ ఆమోదం.
> 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామకం కోసం చేసిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం.
> ఏపీ
రిజిస్ట్రేషన్ చట్టం 22ఏ నిషేధ జాబితాలోని
ఆస్తుల అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దుతో పాటు ఫీజు మినహాయింపునకు కేబినెట్ ఆమోదం.
> కడప
జిల్లాలో అదానీ గ్రీన్ ఎనర్జీ కి 1000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్.
> సత్యసాయి
జిల్లాలో అదానీ గ్రీన్ ఎనర్జీ 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుకు భూ కేటాయింపు చేసేందుకు ఆమోదం.
> నెల్లూరు
జిల్లా ముత్తుకూరులో 615 ఎకరాల భూమి
పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు ఏపీఐఐసీకి ఉచితంగా బదలాయించేందుకు అంగీకారం.
> రాజకీయ
కక్షతో హత్యకు గురైన తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు
కేబినెట్ ఆమోదం.
> చిత్తూరు
జిల్లా పలమనేరు రెవెన్యూ డివిజన్ నుంచి కొన్ని మండలాలు అన్నమయ్య జిల్లాలో
కలిపేందుకు కేబినెట్ ఆమోదం.
> అమరావతిలో
క్వాంటమ్ వ్యాలీ ప్రాజక్టు కోసం ఐబీఎం, టీసీఎస్లతో
ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలకు కేబినెట్ ఆమోదం.
> రవాణా వాహనాలకు గ్రీన్ ట్యాక్స్ తగ్గించేందుకు ఏపీ మోటారు వాహనాల చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం.
===================


0 Komentar