AP Cabinet Meeting Highlights – 04/06/2025
ఏపీ
క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే – 04/06/2025
=====================
Cabinet Decisions - Press Briefing by
Sri. Kolusu Parthasarathy, Hon'ble Minister for Information and Public
Relations, Housing at Publicity Cell, Block-04, AP Secretariat on 04-06-2025
LIVE
ఏపీ
క్యాబినెట్ మీటింగ్ గురించి ప్రెస్ మీట్ ప్రత్యక్ష ప్రసార వివరాలు ఇవే
YouTube Link:
https://www.youtube.com/watch?v=Z7q1YSzP0rc
=====================
ఏపీ
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా
కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను సమావేశం అనంతరం మంత్రులు ప్రెస్ మీట్ లో
వివరించారు.
కేబినెట్
నిర్ణయాలు ఇవే:
> సీఆర్డీఏ
సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం.
> వివిధ
సంస్థలకు చేసిన భూ కేటాయింపులు, రాయితీల
కల్పనకు క్యాబినెట్ ఆమోదం.
> రక్షితనీటి
సరఫరాకు శ్రీకాకుళంలో రూ.5.75 కోట్ల వయబిలిటీ
గ్యాప్ ఫండ్ కు ఆమోదం.
> కుప్పంలో
రూ.8.22 కోట్లు వయబిలిటి గ్యాప్ ఫండ్ విడుదలకు ఆమోదం.
> సత్ప్రవర్తన
కలిగిన ఖైదీల విడుదలకే కేబినెట్ ఆమోదం. 1 ఫిబ్రవరి 2025 నాటికి అర్హులైన 17 మంది
యావజ్జీవ ఖైదీలకు క్షమాభిక్ష మంజూరు.
> 248 మంది కానిస్టేబుళ్లకు పదోన్నతి కల్పించే ప్రతిపాదనకు ఆమోదం.
> వైఎస్సార్
జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా మారుస్తూ తెచ్చిన జీవోకు కేబినెట్ ఆమోదం.
> పోలీసు
అకాడమీకి అదనంగా 94.45 ఎకరాలు ఇచ్చేందుకు
కేబినెట్ ఆమోదం.
> మహిళలు
రాత్రిపూట కూడా పనిచేసే చట్టసవరణకు ఆమోదం. రాత్రిపూట పనిచేసే మహిళలకు భద్రత, రవాణా సౌకర్యం కల్పించాలి.
=====================


0 Komentar