Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IPL 2025: RCB Wins First Title After 18 Years – Completely Dominant Royal Challengers Bengaluru in the 2025 Season

 

IPL 2025: RCB Wins First Title After 18 Years – Completely Dominant Royal Challengers Bengaluru in the 2025 Season

ఐపీఎల్‌-2025: పద్దెనిమిది ఏళ్ల తర్వాత టైటిల్ గెలిచిన ఆర్సీబీ – ఈ సీజన్ లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

====================

Ee Sala Cup N̶a̶m̶d̶e̶ Namdu - ఈసారి కప్ బెంగళూరుదే

ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కల నెరవేరింది. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఆర్సీబీ తొలి టైటిల్ సాధించింది. పంజాబ్ కింగ్స్ తో జరిగిన ఫైనల్లో 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.

పంజాబ్ బ్యాటర్లలో జోష్ ఇంగ్లిస్ (39; 23 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్ లు), ప్రభసిమ్రన్ సింగ్ (26), ప్రియాంశ్ ఆర్య (24), నేహల్ వధేరా (15) పరుగులు చేశారు. చివర్లో శశాంక్ సింగ్ (61*; 30 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్లు) పోరాడినా పంజాబు ఓటమి తప్పలేదు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 2, కృనాల్ పాండ్య 2, హేజిల్ వుడ్, రొమారియో షెఫర్డ్, యశ్ దయాల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్ కు ఓపెనర్లు శుభారంభం అందించారు. ప్రియాంశ్ ఆర్య, ప్రభ్సిమ్రన్ నిలకడగా బౌండరీలు బాది తొలి వికెట్ కు 43 పరుగులు జోడించారు. హేజిల్ వుడ్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ప్రభ్ సిమ్రాన్ ఇచ్చిన క్యాచ్ లు రొమారియో షెఫర్డ్ అందుకోలేకపోయాడు. హేజిల్ వుడ్ వేసిన ఐదో ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదిన ప్రియాంశ్.. చివరి బంతికి ఔటయ్యాడు. బౌండరీ లైన్ వద్ద ఫిల్ సాల్ట్ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో ప్రియాంశ్ వెనుదిరిగాడు.

పవర్ ప్లే ముగిసేసరికి పంజాబ్ 52/1తో నిలిచింది. సుయాశ్ శర్మ వేసిన 8వ ఓవర్లో జోష్ ఇంగ్లిస్ రెండు సిక్స్లు కొట్టాడు. కృనాల్ వేసిన తొమ్మిదో ఓవర్లో ప్రభ్సిమ్రన్.. భువీకి క్యాచ్ ఇచ్చాడు. తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ (1)ని రొమారియో షెఫర్డ్ బౌలింగ్ లో వికెట్ కీపర్ జితేశ్ కు చిక్కాడు. జోష్ ఇంగ్లిస్ దూకుడుగా ఆడటంతో 12 ఓవర్లకు పంజాబ్ 98/3తో మెరుగైన స్థితిలో కనిపించింది.

తర్వాతి ఓవర్ లోనే ఇంగ్లిస్ ని కృనాల్ వెనక్కి పంపాడు. నేహల్ వధేరా (15), మార్కస్ స్థాయినిస్ (6) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. అయితే, చివర్లో శశాంక్ సింగ్ దూకుడుగా ఆడాడు. భువనేశ్వర్ 19 ఓవర్లో సిక్స్, ఫోర్ బాదాడు. హేజిల్ వుడ్ 20 ఓవర్లో విజయసమీకరణం 29 కాగా.. తొలి రెండు బంతులు డాట్ అయ్యాయి. తర్వాత దీంతో ఆర్సీబీ విజయం ఖరారైపోయింది. చివరి నాలుగు బంతులకు శశాంక్ వరుసగా 6, 4, 6, 6 బాదినా ప్రయోజనం లేకపోయింది.

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ.. బ్యాటర్లలో విరాట్ కోహ్లి (43; 35 బంతుల్లో 3x4) రాణించాడు. ఫిల్ సాల్ట్ (16; 9 బంతుల్లో 2x4, 1x6) మయాంక్ అగర్వాల్ (24; 18 బంతుల్లో 2x4,1x6), రజత్ పాటిదార్ (26; 16 బంతుల్లో 1x4, 2x6), లివింగ్స్టన్ (25; 15 బంతుల్లో 2x6), రొమారియో షెఫర్డ్ (17;9 బంతుల్లో 1x4; 1x6) కీలక ఇన్నింగ్స్ ఆడారు. జితేశ్ శర్మ (24; 10 బంతుల్లో 2x4, 2x6) మెరుపులు ఆకట్టుకున్నాయి. పంజాబ్ బౌలరల్లో జెమీసన్, అర్షదీప్ సింగ్ చెరో 3 వికెట్లు పడగొట్టగా అజ్మతుల్లా, యుజ్వేంద్ర చాహల్, విజయ్ కుమార్ తలో వికెట్ తీశారు.


ఫైనల్ మ్యాచ్ అవార్డులు:

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్: కృనాల్ పాండ్య  

సిరీస్ అవార్డులు:  

ఆరెంజ్ క్యాప్: సాయి సుదర్శన్‌ (759 పరుగులు)

పర్పుల్ క్యాప్: ప్రసిద్ధ్‌ కృష్ణ (25 వికెట్లు)

ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్: సాయి సుదర్శన్‌.

అత్యంత విలువైన ఆటగాడు (MVP): సూర్య కుమార్‌ యాదవ్‌

సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్: వైభవ్‌ సూర్యవంశీ

అత్యధిక సిక్సర్లు: నికోలస్ పూరన్

అత్యధిక ఫోర్ లు: సాయి సుదర్శన్  

ఫెయిర్‌ ప్లే అవార్డు: చెన్నై సూపర్‌ కింగ్స్‌

క్యాచ్‌ ఆఫ్‌ ది సీజన్‌: కమిండు మెండిస్‌

====================

VIDEOS

FINAL MATCH HIGHLIGHTS

POST MATCH CEREMONY

KOHLI VIDEO

==================== 

Previous
Next Post »
0 Komentar

Google Tags