Census 2027: Centre Released Gazette Notification
on Census – Details Here
జన గణన 2027: 15 ఏళ్ల తర్వాత చేపట్టబోయే జన గణన కు సంబంధించి గెజిట్
నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం
=====================
మన దేశంలో 15 ఏళ్ల తర్వాత చేపట్టబోయే జన గణన (Census)కు సంబంధించిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సోమవారం (జూన్ 16) గెజిట్
నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో జనాభా లెక్కింపు ప్రక్రియ నేటి నుంచి
అధికారికంగా ప్రారంభమైనట్లయ్యింది. మొత్తంగా రెండు దశల్లో జనాభాను
లెక్కించనున్నారు. 2027 మార్చి 1వ తేదీ నాటికి జనగణన పూర్తి కానుంది.
మంచు
ఎక్కువగా ఉండే "కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూకశ్మీర్, లద్దాఖ్ తో సహా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ 2026 అక్టోబరు 1 అర్ధరాత్రి వరకు జన గణనను నమోదు
చేయనున్నాం. ఇవి కాకుండా దేశవ్యాప్తంగా మిగతా ప్రాంతాలన్నింటిలో 2027 మార్చి 1 నాటికి జనాభా
లెక్కను పూర్తి చేయనున్నాం" అని హోంమంత్రిత్వ శాఖ ఆ నోటిఫికేషన్లో
వెల్లడించింది. ఇది మొత్తంగా 16వ, స్వాతంత్య్రానంతరం చేపట్టబోయే 8వ జన గణన.
ఈసారి జన
గణనతోపాటు కుల గణనను చేపడుతున్నారు. ఇందుకోసం మొత్తం 34 లక్షల మంది గణకులు, సూపర్వైజర్లు, 1.34 లక్షల మంది సిబ్బంది పని చేస్తారు. ఈసారి జనాభా లెక్కల
సేకరణ అంతా ట్యాబ్ ద్వారా పూర్తిగా డిజిటల్ రూపంలోనే సాగుతుంది. ప్రభుత్వం
వెల్లడించే పోర్టళ్లు, యాప్లలో ప్రజలు
సొంతంగానే తమ వివరాలను నమోదుచేసే వెసులుబాటునూ కల్పిస్తున్నారు. డేటా భద్రత కోసం
కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. సమాచారణ సేకరణ, బదిలీ, స్టోరేజీని అత్యంత
కట్టుదిట్టంగా చేపడుతున్నట్లు తెలిపింది.
సాధారణంగా
పదేళ్లకోసారి జనాభా లెక్కలు నిర్వహిస్తారు. చివరిసారి 2011లో దీన్ని చేపట్టారు. 2021 జనాభా లెక్కలకు సంబంధించి 2020లోనే ఈ ప్రక్రియ
చేపట్టాల్సింది. కానీ.. కొవిడ్ కారణంగా వాయిదా పడింది. ఈ క్రమంలోనే జనగణనతో పాటు
కుల గణన చేపట్టాలని దేశవ్యాప్తంగా డిమాండ్ పెరగడం, కొన్ని రాష్ట్రాల్లో స్థానిక ప్రభుత్వాలు పూర్తి చేయడంతో కుల గణనకూ కేంద్రం
సిద్ధమైంది. ఇప్పటికే జనాభా లెక్కల వివరాల నమోదుకు సంబంధించి 30కి పైగా ప్రశ్నలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
=====================
=====================
Notification for #Census2027 has been issued. With this, process of Census has commenced.
— Census India 2027 (@CensusIndia2027) June 16, 2025
Reference Date: 1st March 2027 for all States/UTs except for Ladakh and snow-bound areas of J&K, Himachal Pradesh & Uttarakhand where it'll be 1st October 2026@HMOIndia @PIBHomeAffairs pic.twitter.com/3WOWqSB9nb


0 Komentar