DIGI PIN: India's New Digital Address
System – Alternative for PIN CODE – Details Here
పిన్ కోడ్ కు
ప్రత్యామ్నాయం గా భారతదేశపు కొత్త డిజిటల్ అడ్రస్ సిస్టమ్ “డిజిపిన్”
=====================
పోస్ట్
ద్వారా ఏదైనా వస్తువును పంపించేందుకు ఇప్పటివరకూ PIN CODE వాడేవాళ్లు. ఇకపై దీని స్థానంలో DIGI PINను కూడా వాడొచ్చని ఇండియా పోస్ట్ తెలిపింది.
ఈ పది అంకెల
కోడ్ మీ ఇంటి గుమ్మాన్ని సరిగ్గా సూచిస్తుందని పేర్కొంది. ఇందులో GPS కూడా ఎంతో కచ్చితంగా (4 మీటర్లలోపు)
ఉంటుందని,
పూర్తి చిరునామాను ఎంటర్ చేయకుండా డిజి పిన్ ను అందిస్తే సరిపోతుందని సూచించింది. ఈ లింక్
క్లిక్ చేసి మీ DIGI పిన్ ను తెలుసుకోండి.
=====================
చిరునామాలో
పిన్ కోడ్ రాయడం తప్పనిసరి. అయితే ఈ పిన్ కోడ్ విస్తృత ప్రాంతాన్ని సూచిస్తుంది. దీంతో
కచ్చితమైన చిరునామా కనుక్కోవడం ఒక్కోసారి కష్టంగా మారుతుంది. ఇక మారుమూల
ప్రాంతాల్లో అయితే అడ్రస్ తెలుసుకోవడం మరీ ఇబ్బందికరం. ఇప్పుడు భారత పోస్టల్ శాఖ
డిజిటల్ అడ్రస్ సిస్టమ్ 'డిజిపిన్'ను తీసుకొచ్చింది.
అసలేంటీ
డిజిపిన్?
ఎలాఉపయోగపడుతుంది?
మీరున్న
నివాసాన్ని కచ్చితత్వంతో గుర్తించేందుకు సాయపడే 10 అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్ ఈ డిజిపిన్. మారుమూల ప్రాంతాల్లో అంబులెన్స్, అగ్నిమాపక రెస్క్యూ ఆపరేషన్ల వంటి అత్యవసర సేవల్ని
మెరుగుపరచాలనే లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చారు. ఈ డిజిపిన్ ను ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లతో పంచుకోవచ్చు. గ్రామీణ
ప్రాంతాలు, అభివృద్ధి చెందని ప్రదేశాలు.. ఇలా
స్పష్టమైన చిరునామాలు లేని ప్రాంతాల్లో ఇది అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది.
ఐఐటీ హైదరాబాద్, ఎస్ఆర్ఎస్సీ, ఇస్రో
సహకారంతో పోస్టల్ శాఖ తీసుకొచ్చిన ఓపెన్ - సోర్స్ జియోకోడెడ్ చిరునామా వ్యవస్థ
ఇది. దేశవ్యాప్తంగా ప్రతి 4 మీటర్ల x 4 మీటర్ల ప్రదేశాన్ని గ్రిడ్లుగా విభజించి, ప్రతి గ్రిడ్ కు అక్షాంశ- రేఖాంశాల ఆధారంగా 10 డిజిట్ కోడ్ను కేటాయిస్తుంది. ఇది గృహాలు, కార్యాలయాలు, సంస్థలు ఇలా
మొదలైన వాటిని కచ్చితంగా గుర్తిస్తుంది.
పోస్టల్ శాఖ
తీసుకొచ్చిన డిజిపిన్ ప్లాట్ఫామ్ సాయంతో పిన్ పొందొచ్చు. ఇందులో మీకు కావాల్సిన
లొకేషన్ పై ట్యాప్ చేయగానే పిన్ కనిపిస్తుంది. ఆ కోడ్ ను మీ చిరునామాకు
జోడించవచ్చు. ఆఫ్లైన్ లో కూడా వినియోగించేలా డిజిపిన్ ను రూపొందించారు. ఇది
చిరునామాను మార్చదు. అదనపు డిజిటల్ చిరునామాగా పనిచేస్తూ కచ్చితమైన స్థానాన్ని
గుర్తిస్తుంది. భవిష్యత్తులో జీఐఎస్ వ్యవస్థలతో డిజిపిన్ ఏకీకరణ జరిగితే సంప్రదాయ
చిరునామాల అవసరం తగ్గే అవకాశం ఉంది.
=====================
=====================



0 Komentar