French Open Women’s Final 2025: Coco
Gauff Wins First Roland Garros Title by Defeating Aryna Sabalenka
ఫ్రెంచ్
ఓపెన్ - 2025 విజేత గా కోకో గాఫ్ – మొదటి ఫ్రెంచ్
ఓపెన్ టైటిల్, మొత్తం గా 2వ గ్రాండ్ స్లామ్ తో మహిళల నెం.2
==================
స్ఫూర్తిదాయక
ప్రదర్శన చేసిన అమెరికా అమ్మాయి కోకో గాఫ్, టైటిల్ ఫేవరెట్ మరియు ప్రపంచ నంబర్ వన్
అర్యానా సబలెంకా పవర్ గేమ్ కు చెక్ పెడుతూ- కెరీర్ లో రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్
ను గెలుచుకుంది. ఫైనల్లో తొలి సెట్ ను కోల్పోయాక.. గాఫ్ పోరాడిన తీరు అద్భుతం. 2015 (సెరెనా) తర్వాత ఫ్రెంచ్ టైటిల్ గెలిచిన తొలి అమెరికా మహిళగా
ఆమె నిలిచింది.
ప్రపంచ నంబర్
2 కొకో గాఫ్ ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచింది. శనివారం
హోరాహోరీగా సాగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఆమె 6-7 (5-7), 6-2, 6-4తో టాప్ సీడ్ సబలెంకా (బెలారస్) పై విజయం సాధించింది. తొలి
సెట్ ను కోల్పోయాక గాఫ్ గొప్పగా పోరాడింది. సబలెంకా పవర్ గేమ్ సమర్థంగా ఎదుర్కొంటూ
ఆమె విజయాన్నందుకుంది.
మ్యాచ్ లో గాఫ్
మూడు ఏస్ లు, 30 విన్నర్లు కొట్టింది. రెండు ఏస్ లు, 37 విన్నర్లు కొట్టిన సబలెంకా.. ఏకంగా 70 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. సబలెంకా 6, గాఫ్ 8 డబుల్ ఫాల్ట్లు
చేశారు. గాఫ్ 9 సార్లు ప్రత్యర్థి సర్వీసును బ్రేక్
చేసింది. సబలెంక 6 బ్రేకులు
సాధించింది. గాఫ్కు కెరీర్లో ఇది రెండో గ్రాండ్లమ్. ఇంతకుముందు 2023లో యుఎస్ ఓపెన్ గెలిచింది. అప్పుడు కూడా ఆమె ఫైనల్లో
సబలెంకాపై నెగ్గింది. గాఫ్ 2022లో ఫ్రెంచ్ ఓపెన్ లో
రన్నరప్ గా నిలిచింది.
తొలి సెట్
నాటకీయంగా సాగింది. పదే పదే సర్వీసు బ్రేకులతో ఆధిపత్యం చేతులు మారుతూ ఉండడంతో
సెట్ ఆసక్తి రేపింది. మూడు, అయిదో గేముల్లో
బ్రేక్ సాధించిన సబలెంక సెట్న చేజిక్కించుకునే దిశగా దూసుకెళ్లింది. కానీ 1-4తో వెనుకబడ్డ గాఫ్ అద్భుతంగా పుంజుకుంది. ఆరు, ఎనిమిది గేముల్లో ప్రత్యర్థి సర్వీసును బ్రేక్ చేసిన గాఫ్ 4-4తో స్కోరు సమం చేసింది. కానీ 9వ గేమ్ తిరిగి బ్రేక్ సాధించిన సబలెంకా 5-4తో ఆధిక్యంలో నిలిచింది. ఆ వెంటనే గాఫ్ కూడా బ్రేక్
సాధించడంతో మళ్లీ స్కోరు సమమైంది. ఆ తర్వాత క్రీడాకారిణులిద్దరూ మరోసారి సర్వీసు
బ్రేక్ చేసుకోవడంతో టైబ్రేక్ తప్పలేదు. టైబ్రేక్ లో 4-1తో ఆధిక్యంలో నిలిచిన గాఫ్ చక్కని అవకాశాన్ని
చేజార్చుకుంది. పుంజుకున్న సబలెంక.. టైబ్రేక్ లో లో గెలిచి సెట్ను చేజిక్కించుకుంది. తొలి సెట్లో
సబలెంక నాలుగు, గాఫ్ మూడు డబుల్ ఫాల్ట్లు చేయడం
గమనార్హం.
మొదటి సెట్ ను
కొద్దిలో కోల్పోయిన గాఫ్.. ఆ తర్వాత కసిగా ఆడింది. బలంగా పుంజుకున్న ఆమె.. రెండో
సెట్లో బలమైన ఫోర్ హ్యాండ్ షాట్లతో అదరగొట్టింది. సర్వీసులు కూడా చక్కగా చేసింది.
తొలి,
అయిదో గేముల్లో బ్రేకులతో 4-1తో ఆధిక్యంలో దూసుకెళ్లిన ఆమె.. ఆరో గేమ్ సర్వీసు కోల్పోయినా వెంటనే
పుంజుకుంది. తర్వాతి గేమ్ నే బ్రేక్ సాధించి, సర్వీసు
నిలబెట్టుకుని సెట్ను గెలుచుకుంది. మూడో సెట్ కూడా ఆసక్తికరంగా సాగింది. జోరు
కొనసాగించిన గాఫ్ మూడో గేమ్ లోనే బ్రేక్ తో ఆధిక్యంలో నిలిచినా.. ఆరో గేమ్ బ్రేక్ తో సబలెంకా
3-3తో స్కోరు సమం చేసింది. కానీ ఆమె సంతోషం ఎంతో సేపు
నిలువలేదు. పట్టుదలగా పోరాడిన గాఫ్.. ఏడో గేమ్ లో అలవోకగా బ్రేక్ సాధించింది.
తర్వాత సర్వీసు నిలబెట్టుకుంటూ సెట్ ను ఛాంపియన్షిప్ ను గెలుచుకుంది.
==================



0 Komentar