Indian Coast Guard Recruitment 2025:
Apply for 630 Navik & Yantrik Posts – Detail Here
ఇండియన్
కోస్ట్ గార్డ్ లో 630 నావిక్ & యాంత్రిక్ పోస్టులు - ప్రాథమిక వేతనం:
నెలకు రూ.21,700 - రూ.29,200.
====================
కోస్ట్
గార్డ్ ఎన్రోల్డ్ పర్సనల్ టెస్ట్ (సీజీఈపీటీ)-01/2026 అండ్ 027 2026 బ్యాచ్ ద్వారా నావిక్ (జనరల్
డ్యూటీ,
డొమెస్టిక్ బ్రాంచ్), యాంత్రిక్
ఉద్యోగాల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.
రాత,
శరీరదారుడ్య, వైద్య
పరీక్షల ద్వారా నియామకాలు చేపడతారు. ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ అందిస్తారు.
పోస్టుల
వివరాలు:
సీజీఈపీటీ- 01/26 బ్యాచ్:
1. నావిక్ (జనరల్ డ్యూటీ): 260 పోస్టులు
2. యాంత్రిక్ (మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్): 60 పోస్టులు
సీజీ ఈపీటీ -
02/26 బ్యాచ్:
1. నావిక్ (జనరల్ డ్యూటీ): 260 పోస్టులు
2. నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్): 50
అర్హత:
నావిక్ పోస్టులకు 12వ తరగతి (మ్యాథ్స్/
ఫిజిక్స్), నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ పోస్టులకు
పదో తరగతి, యాంత్రిక్ పోస్టులకు 10వ లేదా 12వ తరగతితో పాటు
సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.(01-08-2004 నుంచి 01-08-2008 మధ్య
జన్మించి ఉండాలి). ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది.
బేసిక్ పే:
నెలకు నావిక్ పోస్టులకు రూ.21,700. యాంత్రిక్ పోస్టులకు
రూ.29,200
.
ఎంపిక
విధానం: స్టేజ్-1, స్టేజ్-2, స్టేజ్-3, స్టేజ్-4 పరీక్షలు, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష
రుసుము: రూ.300 (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది).
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభ తేదీ: 11-06-2025
దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 25-06-2025
====================
====================


0 Komentar