Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

National Awards to Teachers 2025 – All the Details Here

 

National Awards to Teachers 2025 – All the Details Here

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు 2025 – పూర్తి వివరాలు ఇవే

====================

UPDATE 05-09-2025

====================

UPDATE 25-08-2025

National Teachers’ Awards 2025:

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు గ్రహీతల జాబితా విడుదల

తెలుగు రాష్ట్రాల అవార్డులకు ఎంపికైన ఉపాధ్యాయులు వీరే

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు-2025ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక మహిళా ఉపాధ్యాయురాలు మరియు తెలంగాణ నుంచి ఒక మహిళా ఉపాధ్యాయురాలు కు అవార్డు వరించింది.

CLICK FOR SELECTED TEACHERS

 

1. మాదాబత్తుల తిరుమల శ్రీదేవి గారు (విశాఖపట్నం, ఆంధ్ర ప్రదేశ్)

శ్రీదేవి గారి మాటల్లో..  

నేను జీవశాస్త్రం బోధిస్తుంటా. మూస పద్ధతిలో పాఠాలు చెబితే ఎవరూ ఆసక్తి చూపరు. అందుకే, ఉదాహరణలతో చెబుతున్నాం. వివిధ ప్రాజెక్టులు చేయిస్తూ వారిలో ఆసక్తి పెంచుతున్నాం. మారుతున్న కాలంతో పాటు బోధన విధానాలూ మారాలి. సాంకేతిక సాయమూ అవసరమే. మేం తరగతి గదుల్లో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టూల్స్(ఐసీటీ)ను వినియోగిస్తున్నాం. దీని ఫలితంగానే... ఫలితాలు మెరుగుపడుతున్నాయి.

గతంతో పోలిస్తే మా దగ్గర ప్రవేశాలు 21 శాతం పెరిగాయి. విద్యార్థుల సంఖ్య ఎక్కువై ఒక్కోసారి చేర్చుకోలేమని చెప్పాల్సి వస్తోంది. పాఠశాలలో క్రమశిక్షణ, బోధన విధానాలు చూసి ఇక్కడ చేరేందుకు వివిధ మార్గాల్లో సిఫార్సు చేయించుకుంటారు. మా పిల్లలు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని బహుమతుల్నీ సాధిస్తున్నారు. ఏ ఉపాధ్యాయురాలికైనా ఇంతకు మించిన సంతృప్తి ఉంటుందా!

ప్రాజెక్టులెన్నో...

మా విద్యార్థులతో జల, వాయు కాలుష్యంపై ఇప్పటికే ఎన్నో ప్రాజెక్టులు చేయించాం. అందులో విశాఖ లాసబ్బీ కాలనీలో వర్షపు నీటిని ఒడిసిపట్టి, భూగర్భ జలాలు పెంపొందించడానికి చేసిన ఆక్వాకాన్ ప్రాజెక్టు ఒకటి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా ఆ ప్రాజెక్టుకు జాతీయ స్థాయిలో అయిదో స్థానం లభించింది. యూఎన్డీపీ సాయంతో క్లౌడ్బరస్ట్ పైన అవగాహన కల్పించాం. కుటుంబ సభ్యులు, తోటి ఉపాధ్యాయుల సహకారంతో ముందుకు సాగుతున్నా. తొలుత అవార్డుకు దరఖాస్తు చేయలేదు. అన్ని ప్రాజెక్టులు చేసి ఎందుకు చేయకూడదని సహాధ్యాయులు ప్రశ్నించారు. వారు ప్రోత్సహించడంతో.. ముందడుగు వేశా.


2. మారం పవిత్ర గారు (సూర్యపేట, తెలంగాణ)

పవిత్ర గారి మాటల్లో...   

నాకు సైన్స్ పై ప్రేమ కలగడానికీ, ఎన్నో పురస్కారాలు అందుకోవడానికీ సైన్స్ టీచర్లే కారణం. నా విద్యార్థులకీ అలా సబ్జెక్టు మీద ఆసక్తి కలిగేలా బోధించాలనుకున్నా. నేను జీవశాస్త్ర ఉపాధ్యాయురాలిని. సూర్యాపేట జిల్లా, పెన్ పహాడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నా. సాంకేతికతను ఉపయోగించి ప్రయోగాల ద్వారా విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధిస్తున్నా. సత్ఫలితాలూ సాధిస్తున్నా. 2009లో రామన్నగూడెం యూపీఎస్ జీవశాస్త్ర ఉపాధ్యాయురాలిగా నా ప్రయాణం మొదలైంది. 2023లో బదిలీపై పెన్పహాడ్ జడ్పీ ఉన్నత పాఠశాలకు వచ్చా. 6 నుంచి 10 తరగతుల విద్యార్థుల కోసం కార్డు, బోర్డు గేమ్స్ తోపాటు ప్రత్యేకంగా తక్కువ ఖర్చుతో బోధన అభ్యసన సామగ్రిని తయారుచేస్తా. వాటితో ఆడిస్తూ పాఠ్యాంశాలపై అవగాహన పెంచుతున్నా. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో నిర్వహిస్తున్న సైన్స్ పోటీలు, ఇన్స్పైర్, నేషనల్ చిల్డ్రన్స్ కాంగ్రెస్, అగస్త్య, అన్వేష, జిజ్ఞాస వంటి పోటీల్లో విద్యార్థులు పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నా.

తరగతి గదిలో వినూత్నంగా అవలంబిస్తున్న బోధనాభ్యసన ప్రక్రియ ఫలితాలతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించా. దీంతో సెమినార్లలో మాట్లాడే అవకాశాలొచ్చాయి. జీవశాస్త్ర పాఠ్యాంశాల్లో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగించే విధానంపై ఉపాధ్యాయులకు శిక్షణనీ ఇస్తున్నా. నేను తయారుచేసిన 13 రకాల ఎగ్జిబిట్లను జాతీయ స్థాయి పోటీల్లో ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దీక్ష పోర్టల్లో 99 వీడియో పాఠాలను అప్లోడ్ చేశా. ఇన్నేళ్లలో 'విక్రమ్ సారాబాయ్ టీచర్ సైంటిస్ట్' సహా ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందుకున్నా.

తాజాగా కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయినిగా ఎంపికవ్వడం నా పట్టుదలకి ఓ గుర్తింపు. నా చిన్నప్పుడే నాన్న చనిపోతే అమ్మే మమ్మల్ని పెంచింది. ఆమె కష్టం వృథా పోవొద్దని కష్టపడి చదివా. పెళ్లైనా కొనసాగించి టీచరయ్యా. సైన్స్ నేర్చుకోవడానికీ, దానిపై ఇష్టం పెంచుకోవడానికీ మా మాస్టార్లే కారణం. వాళ్ల బాటలో నడిచి కష్టమని భావించే సైన్లు పట్ల పిల్లల్లో ఇష్టాన్ని పెంచాలనుకున్నా. అందుకోసమే నా ప్రయోగాలన్నీ. అవన్నీ ఫలించి విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తుండటం నాకు ఎక్కువ ఆనందాన్నిచ్చే అంశం.

====================

జాతీయ ఉపాధ్యాయ అవార్డులకు కేంద్ర విద్యా శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పాఠశాల విద్యా రంగంలో నాణ్యత ప్రమాణాలను పెంచేందుకు కృషి చేస్తున్న ఉపాధ్యాయులను గౌరవించేందుకు ఈ అవార్డులు ఇస్తున్నట్లు ప్రకటించింది. జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర కమిటీల వడపోత అనంతరం జాతీయ స్థాయి జ్యూరీ తుది జాబితాను ప్రకటిస్తుందని కేంద్ర విద్యా శాఖ పేర్కొంది. జూన్‌ 23 నుంచి జులై 15వ తేదీ వరకు క్రింద ఇవ్వబడ్డ వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

====================

> 23rd June to 13th July 2025: Opening of web-portal for inviting online self-nomination by teachers.

> 15th July, 2025: Date of final submission of self-nomination by teachers.

> 16th July 2025 to 25th July 2025: District / Regional Selection Committee nominations to be forwarded to the State Selection Committee through online portal.

> In the middle of July, 2025: Constitution of Independent National Jury by Hon'ble Union Education Minister.

> 26th July 2025 to 4th Aug 2025: State Selection Committee / Organization Selection Committee shortlist to be forwarded to Independent National Jury through online portal.

> 5th & 6th August 2025: Intimation to all the shortlisted candidates (154 Max) for selection by Jury through VC interaction as may be decided.

> 7th Aug to 12th August 2025: Selection process by Jury through VC interaction as may be decided.

> 13th August 2025: Finalization of names by Independent National Jury

> 14th August - 20th August 2025: Intimation to selected candidates after approval of Hon’ble Union Education Minister.

> 4th & 5th September 2025: Rehearsal and Presentation of Award.

====================

REGISTER

LOGIN

GUIDELINES

INSTRUCTION MANUAL

WEBSITE

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags