SBI Recruitment 2025: Apply for 541
Probationary Officer Posts – Details Here
ఎస్బీఐలో 541 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు - జీత భత్యాలు: నెలకు రూ. 48,480 - రూ. 85,920 వరకు
===================
దేశంలోని
అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ), పీవో ఖాళీల భర్తీకి భారీ ప్రకటనను విడుదల చేసింది. ఈ
నోటిఫికేషన్ ద్వారా 541 ప్రొబేషనరీ ఆఫీసర్ల
నియమకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి 24.06.2025 నుంచి 14.07.2025 వరకు అవకాశం ఉంది.
ప్రొబేషనరీ
ఆఫీసర్: 541 పోస్టులు (ఎస్సీ- 80, ఎస్టీ - 73, ఓబీసీ - 135, ఈడబ్ల్యూఎస్ - 50, యూఆర్-203)
అర్హతలు:
ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయోపరిమితి: 21 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు:
నెలకు రూ. 48,480 - రూ. 85,920 వరకు
దరఖాస్తు
రుసుము: రూ .750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు
మినహాయింపు ఉంటుంది).
ముఖ్యమైన
తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తు ప్రారంభ తేదీ: 24-06-2025
ఆన్లైన్
దరఖాస్తు చివరి తేదీ: 14-07-2025
===================
APPLY HERE (Turn Your Mobile)
===================


0 Komentar