Airtel: New Rs 189 Prepaid Plan – Details
Here
ఎయిర్ టెల్ నూతన ప్రీపెయిడ్ ప్లాన్ రూ.189 – వ్యాలిడిటీ, డేటా
& పూర్తి వివరాలు ఇవే
====================
భారతీ ఎయిర్ టెల్
నూతన ప్రీపెయిడ్ ప్లాన్ ను తీసుకొచ్చింది. రూ.189తో రీఛార్జి చేస్తే 21 రోజుల పాటు
అన్లిమిటెడ్ కాల్స్, 1 జీబీ డేటా.. 300 ఎస్సెమ్మెస్ లు అందిస్తోంది. ఎయిర్ టెల్ అధికారిక వైబ్సైట్, యాప్ లో ఈ ప్లాన్ అందుబాటులో ఉంది. రూ.200లోపు బేసిక్, షార్ట్ టర్మ్
ప్లాన్ కోసం ఎదురుచూస్తున్న వినియోగదారులకు ఇది ఉపయోగపడుతుంది.
బడ్జెట్ ధరలో
తమ నంబర్ ను యాక్టివ్ గా ఉంచుకోవాలనుకునే వారికి, వ్యాలిడిటీని పొడిగించడానికి మాత్రమే రీఛార్జి చేసుకునే వారికి ఇది
ఉపయోగపడుతుంది. జియోలో తక్కువ ధరకు అందుబాటులో ఉన్న ఇటువంటి ప్లాన్లకు పోటీగా
ఎయిర్టెల్ ఈ ప్లాన్ ను తీసుకొచ్చినట్లు
తెలుస్తోంది. రూ.200 కంటే తక్కువ ధరలో
ఇదివరకే రూ.199 ప్లాన్ ను విక్రయిస్తోంది. ఇది 28 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. 2జీబీ డేటా, అపరిమిత కాల్స్
లభిస్తాయి.
====================
====================



0 Komentar