Bank of Baroda Recruitment
2025: Apply for 2,500 Local Bank Officer Posts – Details Here
బ్యాంక్ ఆఫ్
బరోడాలో 2,500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు – జీతం: రూ.48,480 నుంచి రూ.85,920 + ఇతర అలవెన్సులు
=====================
బ్యాంక్ ఆఫ్
బరోడా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న బ్రాంచుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన 2,500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్
ద్వారా జులై 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
లోకల్
బ్యాంక్ ఆఫీసర్ (Local Bank Officer): 2,500 పోస్టులు
అర్హత:
అభ్యర్థులు ఏదేని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణత కలిగి
ఉండాలి. ప్రొఫెషనల్ డిగ్రీలు (సీఏ, కాస్ట్
అకౌంటెంట్, ఇంజినీరింగ్, మెడికల్) ఉన్నవారు కూడా అర్హులు. కనీసం ఏడాది బ్యాంకింగ్
అనుభవం (కమర్షియల్ బ్యాంక్ లేదా రిజినల్ రూరల్ బ్యాంకులో) ఉండాలి. అభ్యర్థులు
దరఖాస్తు చేసుకునే రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాషలో (చదవడం, రాయడం, మాట్లాడడం)
ప్రావీణ్యత కలిగి ఉండాలి.
వయస్సు
పరిమితి: 01.07.2025 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎస్సీ/ ఎస్టీ 5 సంవత్సరాలు, ఓబీసీ 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ గరిష్ఠంగా 15 ఏళ్లు వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: రూ.48,480 నుంచి రూ.85,920 + ఇతర అలవెన్సులు.
ఎంపిక
విధానం: ఆన్లైన్ పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, భాషా నైపుణ్య పరీక్ష, గ్రూప్
డిస్కషన్ (GD) / ఇంటర్వ్యూ.
ఆన్లైన్
పరీక్ష విధానం: ఇంగ్లీష్, బ్యాంకింగ్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, రీజనింగ్ & క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ మీద ప్రశ్నలు ఉంటాయి.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు
ఫీజు: జనరల్/ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.850. ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఈఎస్ఎం/మహిళా అభ్యర్థులకు రూ175.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభ తేదీ: 04/07/2025
ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ చివరి తేదీ: 24/07/2025
=====================
APPLY HERE (Turn Your
Mobile)
=====================

0 Komentar