IBPS Recruitment 2025: Apply for 10,277 CRP
CSA-XV Posts – Details Here
ఐబీపీఎస్ సీఆర్పీ
CSA XV 10,277 పోస్టులు – జీతం:
నెలకు రూ.24,050 - రూ.64,480.
====================
ఇన్స్టిట్యూట్
ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS)... 10,277 క్లర్క్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నేపథ్యంలో 2025-27 సంవత్సరానికి సంబంధించి దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో
ఖాళీగా ఉన్న కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ (CRP) -కస్టమర్ సర్వీస్ అసోసియేట్(CSA)-XV ఉద్యోగాల భర్తీకి
నోటిఫికేషన్ విడుదల చేసింది.
దీని ద్వారా
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టులను ఐబీపీఎస్ భర్తీ చేయనుంది. దరఖాస్తు
చేసుకోవాలనుకునే అభ్యర్థులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం
ఉండాలి. ప్రాథమిక, మెయిన్స్ పరీక్షల
ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అర్హత, ఆసక్తిగల
అభ్యర్థులు ఆగస్టు 1వ తేదీ నుంచి 21 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్, నవంబర్లో పరీక్షలు నిర్వహిస్తారు.
కస్టమర్
సర్వీస్ అసోసియేట్(సీఎస్ఏ): 10,277 ఖాళీలు
తెలుగు రాష్ట్రాల్లో
ఖాళీలు:
1. తెలంగాణ: 261
2. ఆంధ్రప్రదేశ్: 367
అర్హత:
పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి
డిగ్రీ ఉత్తీర్ణతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. స్థానిక భాషలో చదవడం, రాయడం వచ్చి ఉండాలి.
వయోపరిమితి: 2025 ఆగస్టు 1వ తేదీ నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
ఓబీసీకి 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు
రూ.24,050
- రూ.64,480.
ఎంపిక
విధానం: ప్రిలిమినరీ, మెయిన్స్, స్థానిక భాష పరీక్షలు, డాక్యుమెంట్
వెరిఫికేషన్
దరఖాస్తు
ప్రక్రియ: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు
ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్ఎం, డీఈఎస్ఎం అభ్యర్థులకు రూ.175. ఇతరులకు రూ.850.
ముఖ్యమైన
తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తుల ప్రారంభం: 01-08-2025
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21-08-2025
====================
====================


0 Komentar