SBI Recruitment
2025: Apply for 6,589 Junior Associate Posts – Details Here
ఎస్బీఐలో 6,589 జూనియర్ అసోసియేట్ పోస్టులు – జీతం: నెలకు రూ.24,050 - రూ.64,480.
===================
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లరికల్ కేడర్ లో జూనియర్
అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) ఉద్యోగాల భర్తీకి అర్హత
కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నియామక ప్రక్రియ ద్వారా వివిధ
రాష్ట్రాలు/యూటీలలో మొత్తం 6,589 ఖాళీలను (5,180 రెగ్యులర్
ఖాళీలు + 1,409 బ్యాక్లాగ్ ఖాళీలు) ఎస్బీఐ భర్తీ చేయనుంది.
ప్రిలిమినరీ, మెయిన్స్, స్థానిక భాష
ప్రావీణ్య పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అర్హత గల అభ్యర్థులు ఆగస్టు 26వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్): 6,589 (రెగ్యులర్: 5,180 + బ్యాక్ లాగ్:
1,409)
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీ చివరి
సంవత్సరం/ సెమిస్టర్ విద్యార్థులు తాత్కాలికంగా దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ 31.12.2025 నాటికి లేదా అంతకు ముందు గ్రాడ్యుయేషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: 2025 ఏప్రిల్ 1వ తేదీ
నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్లు
ఉండాలి. 02-04-1997 & 01-04-2005 మధ్య అభ్యర్థులు జన్మించి ఉండాలి.
ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 నుంచి 15 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు రూ.24,050 - రూ.64,480 .
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎన్ఎస్, డీఎక్స్ప్రెస్ అభ్యర్థులకు ఫీజు
లేదు.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: 06-08-2025
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 26-08-2025
===================
APPLY HERE (TURN YOUR MOBILE)
===================


0 Komentar