AP: DSC & TET Updates
from Education Minister
ఏపీ: డీఎస్సీ
& టెట్ గురించి విద్యా శాఖ మంత్రి ఇచ్చిన
అప్డేట్ వివరాలు ఇవే
===================
ఆంధ్ర ప్రదేశ్
లో డీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం మరోసారి శుభవార్త చెప్పింది. వచ్చే ఏడాది 2026 జనవరిలో
మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. అదే ఏడాది
మార్చిలోనే పరీక్షలు నిర్వహించి ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపింది.
మరోవైపు ఈ
ఏడాది నవంబర్ లో టెట్ నిర్వహించాలని నిర్ణయించింది. గురువారం విద్యాశాఖపై మంత్రి
నారాలోకేశ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్సీ వివరాలను వెల్లడించారు.
ఇచ్చిన మాట ప్రకారం.. ఇక నుంచి ఏటా డీఎస్సీ నిర్వహించనున్నట్లు చెప్పారు. విద్యా
విధానంపై అధ్యయనానికి 78 మంది ఉత్తమ టీచర్లను
సింగపూర్ పంపిస్తామన్నారు.
===================
పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, కళాశాల విద్య ఉన్నతాధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించాను. ప్రతిఏటా డిఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీకి ఇచ్చిన హామీకి కట్టుబడి ఈ ఏడాది నవంబర్ చివరివారంలో టెట్, 2026 జనవరి లో డీఎస్సీ నోటిఫికేషన్, మార్చిలో డిఎస్సీ నిర్వహించి, టీచర్ పోస్టులను భర్తీకి… pic.twitter.com/hXrrwRL3MG
— Lokesh Nara (@naralokesh) October 9, 2025


0 Komentar