Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

RRB Recruitment 2025: Apply for 5810 NTPC Graduate Posts – Details Here

 

RRB Recruitment 2025: Apply for 5810 NTPC Graduate Posts – Details Here

రైల్వేలో 5,810 ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్టులు జీతం: నెలకు రూ.25,500 -  రూ.35,400

=====================

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో మొత్తం 5,810 ఖాళీలను భర్తీ చేస్తోంది. ఈ మేరకు వివిధ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (గ్రాడ్యుయేట్)లకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది.

గ్రాడ్యుయేట్ పోస్టులు:

1. కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్: 161 పోస్టులు

2. స్టేషన్ మాస్టర్: 615 పోస్టులు

3. గూడ్స్ రైలు మేనేజర్: 3,416 పోస్టులు

4. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్: 921 పోస్టులు

5. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 638 పోస్టులు

6. ట్రాఫిక్ అసిస్టెంట్: 59

మొత్తం పోస్టుల సంఖ్య: 5,810.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన ఉత్తీర్ణత.

జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్/ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకు డిగ్రీతో పాటు అదనంగా కంప్యూటర్లో ఇంగ్లిష్/ హిందీలో టైపింగ్ ప్రావీణ్యం తప్పనిసరి.

వయోపరిమితి: 01-01-2026 నాటికి 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

ప్రారంభ వేతనం: నెలకు చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్/ స్టేషన్ మాస్టర్ పోస్టులకు రూ.35,400; ట్రాఫిక్ అసిస్టెంట్ కు రూ.25,500; ఇతర పోస్టులకు రూ.29,200.

దరఖాస్తు రుసుము: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.250.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 21/10/2025

దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 20/11/2025

=====================

NOTIFICATION

APPLY HERE

WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags