Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

The Nobel Prize 2025: Mary E. Brunkow, Fred Ramsdell and Shimon Sakaguchi Wins Nobel Prize in Medicine for their Work in Immune System

 

The Nobel Prize 2025: Mary E. Brunkow, Fred Ramsdell and Shimon Sakaguchi Wins Nobel Prize in Medicine for their Work in Immune System

నోబెల్ ప్రైజ్ 2025: ఈ ఏడాది వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి

==================

ఈ ఏడాది వైద్యశాస్త్రంలో విశేష కృషి చేసినందుకుగాను మేరీ ఇ. బ్రంకో, ఫ్రైడ్ రామ్ డెల్, షిమన్ సకగుచీలకు అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం వరించింది. రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన పరిశోధనలకు గుర్తింపుగా ఈ ముగ్గురికీ అవార్డు దక్కింది. స్వీడన్ లోని స్టాక్ హోంలో నోబెల్ బృందం ఈ ప్రకటన చేసింది.

మేరీ ఇ. బ్రంకో, ఫ్రెడ్ రామల్ అమెరికాకు చెందినవారు కాగా సకగుచీ జపాన్ కు చెందిన పరిశోధకుడు. వైద్య విభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రదానం ఈ నెల 13వ తేదీ వరకు కొనసాగనుంది. శరీరంలో శక్తిమంతమైన రోగనిరోధక వ్యవస్థకు నియంత్రణ తప్పనిసరి. లేకపోతే.. సొంత అవయవాలపై దాడి చేసే అవకాశం ఉంది. దీన్ని నిరోధించే 'పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్'కు సంబంధించిన ఆవిష్కరణలకుగానూ ఈ ముగ్గురికి నోబెల్ లభించింది.

రోగనిరోధక కణాలు సొంత శరీరంపై దాడి చేయకుండా అడ్డుకునే 'రెగ్యులేటరీ టీ సెల్స్'ను వీరు గుర్తించారు. “రోగనిరోధక వ్యవస్థ ఎలా పనిచేస్తుందో, అందరికీ ఆటోఇమ్యూన్ వ్యాధులు ఎందుకు రావో అర్థం చేసుకునేందుకు వారి ఆవిష్కరణలు దోహదపడతాయి” అని నోబెల్ కమిటీ ఛైర్మన్ ఓలె కాంపే తెలిపారు.

==================

Previous
Next Post »
0 Komentar

Google Tags