Harjas Singh (Indo-Australian) Scored
Triple century in 50 Over Domestic Match – Highlights Here
హర్జాస్ సింగ్ (ఇండో-ఆస్ట్రేలియన్) 50 ఓవర్ల దేశవాళీ మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీ – పూర్తి వివరాలు & హైలైట్స్ లింక్ ఇదే
====================
50 ఓవర్
ల మ్యాచ్ లో ఓ బ్యాటర్ డబుల్ సెంచరీ సాధిస్తే అద్భుతం. ఇక త్రిశతకం చేస్తే..
మహాద్భుతం అనాల్సిందే. ఇలాంటి అరుదైన రికార్డు అంతర్జాతీయ మ్యాచ్ లో కాకుండా..
డొమెస్టిక్ స్థాయిలో చోటుచేసుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన హర్జాస్ సింగ్.. సిడ్నీ
గ్రేడ్ క్రికెట్ ఆడుతూ ట్రిపుల్ సెంచురీ చేశాడు. కేవలం 141 బంతుల్లోనే 314 పరుగులు చేశాడు. ఇందులో 35 సిక్స్ లు ఉన్నాయి.
వెస్ట్రర్న్ సబర్బ్స్ జట్టు తరఫున హర్జాస్ దూకుడుగా ఆడేశాడు. దీంతో అతడి టీమ్ ఏకంగా 483 పరుగులు చేసింది. ప్రత్యర్థి సిడ్నీ ఫస్ట్ కు చెందిన ఇద్దరు బౌలర్లు తమ కోటా ఓవర్లలో 100+ పరుగులు సమర్పించారు. ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసిన ముల్లెన్ బౌలింగ్ లో హర్జాస్ సిక్స్ వర్షం కురిపించాడు. అనంతరం లక్ష్య ఛేదనలో సిడ్నీ 287 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది.
దేశీయ వన్డే
క్రికెట్లో హర్జాస్తో కలిపి ట్రిపుల్ శతకం చేసింది ముగ్గురే బ్యాటర్లు. ఇక
అంతర్జాతీయ క్రికెట్లో ఈ రికార్డు ఇప్పటి వరకు నమోదు కాలేదు. ఇంతకుముందు న్యూసౌత్
వేల్స్ ప్రీమియర్ ఫస్ట్ గ్రేడ్ క్రికెట్ చరిత్రలో విక్టర్ ట్రంపర్ (1903), ఫిల్ జాక్వెస్ (2007) త్రిశతకాలు బాదారు. విక్టర్ 335 పరుగులు చేయగా..
ఫిల్ 321
పరుగులు చేశాడు. వారిద్దరి తర్వాత హర్జాస్ నిలిచాడు. అతడు
పూర్వీకులు భారత్కు చెందిన వారే కావడం గమనార్హం. అయితే, అతడి కుటుంబం ఆస్ట్రేలియాతో స్థిరపడింది.
====================



0 Komentar