AP: New Districts (3) & New Revenue
Divisions (5) – Preliminary Notifications – G.Os Released
ఏపీ: కొత్త జిల్లాలు (3) & కొత్త రెవెన్యూ డివిజన్ లు(5) – ప్రిలిమినరీ నోటిఫికేషన్
ల ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల
===================
ఏపి లో కొత్త
జిల్లాలు ఏర్పాటు చేస్తూ ప్రిలిమినరీ నోటిఫికేషన్లను ప్రభుత్వం విడుదల చేసింది.
మదనపల్లె,
మార్కాపురంతోపాటు రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా
ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కొత్త జిల్లాలతో
పాటు ఐదు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల
చేసింది.
నంద్యాల
జిల్లాలో బనగానపల్లె, శ్రీ సత్య సాయి
జిల్లాలో మడకశిర, అనకాపల్లి జిల్లాలో
నక్కపల్లి, మదనపల్లె జిల్లాలో పీలేరు, ప్రకాశం జిల్లాలో అద్దంకి రెవెన్యూ డివిజన్ ను ఏర్పాటు
చేస్తూ నోటిఫికేషన్లను జారీ చేసింది. అభ్యంతరాలుంటే 30 రోజుల్లో కలెక్టర్కు లిఖితపూర్వకంగా తెలపాలని పేర్కొంది. ఈ
మేరకు ఆదేశాలను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ జారీ
చేశారు.
మరి కొన్ని మార్పులు:
కొత్త
జిల్లాలు,
నూతన రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతోపాటు.. కొన్ని మండలాలను
వేరే జిల్లాలకు మారుస్తూ నోటిఫికేషన్ ను ప్రభుత్వం జారీ చేసింది. ఒంటిమిట్ట, సిద్దోట్ మండలాలను కడప నుంచి అన్నమయ్య జిల్లాకు మార్చింది.
అలాగే కడప డివిజన్ పరిధిలో ఉన్న ఈ రెండింటిని రాజంపేటలో కలుపుతూ ఆదేశాలు ఇచ్చింది.
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలాన్ని పలమనేరు రెవెన్యూ డివిజన్ నుంచి
చిత్తూరుకు మార్చింది. నెల్లూరు జిల్లాలోని కొండాపురం, వరికుంటపాడు మండలాలను కందుకూరు నుంచి కావలి రెవెన్యూ
డివిజన్కు మార్పు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కలువోయ మండలాన్ని ఆత్మకూరు నుంచి
గూడూరు డివిజను.. సైదాపురం, రాపూరు మండలాలను
నెల్లూరు నుంచి గూడూరు డిజవిన్కు మార్పు చేస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
కోనసీమ జిల్లాలోని మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలను తూర్పుగోదావరి జిల్లాకు బదిలీ
చేసింది. 3 మండలాలను రామచంద్రాపురం డివిజన్ నుంచి
రాజమహేంద్రవరం డివిజన్లకు మార్చింది. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం రెవెన్యూ
డివిజన్ ను మారుస్తూ ఆదేశాలు జారీ చేసింది.
===================
DOWNLOAD G.Os 👇
జిల్లాలు
G.O
– 1492 (పోలవరం జిల్లా)
G.O
– 1497 (మార్కాపురం జిల్లా)
G.O
– 1501 (మదనపల్లె జిల్లా)
రెవెన్యూ డివిజన్
లు
G.O
- 1504 (బనగానపల్లె డివిజన్)
G.O
- 1502 (మడకశిర డివిజన్)
G.O
– 1491 (నక్కపల్లి డివిజన్)
G.O
- 1496 (అద్దంకి డివిజన్)
G.O – 1501 (పీలేరు డివిజన్)
===================

0 Komentar