Women’s Premier League 2026: Schedule
Released
మహిళల
ప్రీమియర్ లీగ్ 2026: షెడ్యూల్ విడుదల
====================
WPL వేలం ఇటీవలే ముగిసిన విషయం తెలిసిందే. ఇందులో భారత ఆల్ రౌండర్ దీప్తి శర్మ అత్యధిక ధర పలికారు. ఆమెను 3.20 కోట్లతో యూపీ వారియర్స్ ఆర్టీఎం కార్డు ఉపయోగించి తీసుకుంది. న్యూజిలాండ్ ఆల్ రౌండర్ అమేలియా కెర్ ను రూ.3 కోట్లకు ముంబయి ఇండియన్స్, భారత ఆల్ రౌండర్ శిఖా పాండేను రూ.2.40 కోట్లకు యూపీ వారియర్స్, కివీస్ సీనియర్ ప్లేయర్ సోఫీ ఎకిల్స్టోన్ ను రూ.2 కోట్లకు గుజరాత్ జెయింట్స్ తీసుకున్నాయి.
ఈ సూపర్ లీగ్
కి సంబంధించి తాజాగా పూర్తి షెడ్యూల్ విడులైంది. డబ్ల్యూపీఎల్ 2026 సీజన్ జనవరి 9న ముంబయి
ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య
నవీముంబయి వేదికగా తొలి మ్యాచ్ తో ప్రారంభం కానుంది. ఫైనల్ మ్యాచ్ వడోదర వేదికగా
ఫిబ్రవరి 5న జరగనుంది. డబ్ల్యూపీఎల్ మ్యాచ్ లు అన్నీ
ఈ రెండు వేదికల్లోనే నిర్వహించనున్నారు. ఈ లీగ్ ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్.. మొత్తం అయిదు జట్లు పోటీ పడుతున్న విషయం
తెలిసిందే.
====================
====================



0 Komentar