ICC Men's T-20 World Cup 2026: Schedule
Released
ఐసీసీ పురుషల
టీ-20
ప్రపంచకప్ 2026 - షెడ్యూల్ విడుదల – భారత్ ఆడే మ్యాచ్ ల తేదీల వివరాలు ఇవే
====================
2026 లో
జరగనునున్న టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్ ను ఐసీసీ ప్రకటించింది. ఈ టోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు
టోర్నమెంట్ జరగనుంది. భారత్, పాకిస్థాన్ ఒకే
గ్రూప్లో ఉన్నాయి. ఈ చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగనుంది.
ఈ సారి కూడా 20 జట్లు పాల్గొననున్నాయి. ఇటలీ మొదటిసారి టోర్నీకి అర్హత
సాధించింది. 20 జట్లను నాలుగు గ్రూప్లు గా
విభజించారు. ప్రతి గ్రూప్ నుంచి రెండేసి జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. సూపర్-8లోని నాలుగు జట్లను రెండు గ్రూప్లుగా విభజిస్తారు. ఇందులో టాప్-2 జట్లు సెమీ ఫైనలు అర్హత సాధిస్తాయి. ఈ మ్యాచ్లు భారత్లోని
అయిదు వేదికల్లో (అహ్మదాబాద్, దిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబయి), శ్రీలంకలోని మూడు
వేదికల్లో (క్యాండీలోని పల్లెకెలె స్టేడియం, కొలంబోలోని
రెండు స్టేడియాల్లో) జరగనున్నాయి.
షెడ్యూల్
విడుదల కార్యక్రమంలో భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ, భారత టీ20 జట్టు సారథి
సూర్యకుమార్ యాదవ్, టీమిండియా మహిళల
జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ పాల్గొన్నారు. భారత్కు 2024 ప్రపంచ కప్ సాధించిన పెట్టిన రోహిత్ శర్మను టీ20 వరల్డ్ కప్ 2026 కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు.
====================
భారత్ ఆడే మ్యాచ్
లు ఇవే
> ఫిబ్రవరి
7 – యూఎస్ఏతో - ముంబయి
> ఫిబ్రవరి
12 – నమీబియాతో - దిల్లీ
> ఫిబ్రవరి
15 – పాకిస్థాన్ తో - కొలంబో
> ఫిబ్రవరి
18 – నెదర్లాండ్స్ - అహ్మదాబాద్
====================
====================




0 Komentar