Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

RBI Recruitment 2026: Apply for 650 Assistant Posts – Details Here

 

RBI Recruitment 2026: Apply for 650 Assistant Posts – Details Here

రిజర్వ్ బ్యాంకులో 650 అసిస్టెంట్ పోస్టులు – డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు - పే స్కేల్: నెలకు రూ.58,514 + అలవెన్సులు.

===================

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్ బోర్డు... దేశవ్యాప్తంగా ఆర్బీఐ శాఖల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 650 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు మార్చి 8 తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

అసిస్టెంట్: 450 పోస్టులు

అర్హత: కనీసం 50% మార్కులతో ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణులైతే సరిపోతుంది. పీసీ వర్డ్ ప్రాసెసింగ్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. అలాగే సంబంధిత రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంత భాషలో ప్రావీణ్యం తప్పనిసరి.

వయస్సు: 01-09-2026 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు; ఓబీసీ అభ్యర్ధులకు మూడేళ్లు; దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల(జనరల్) సడలింపు ఉంటుంది.

పే స్కేల్: నెలకు రూ.58,514 + అలవెన్సులు.

ఎంపిక ప్రక్రియ: ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.450. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు రూ.50.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 16-02-2026

ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 08-03-2026

ప్రిలిమినరీ టెస్ట్ తేదీ: 11-04-2026

మెయిన్ టెస్ట్ తేదీ: 07-06-2026

===================

APPLY HERE

NOTIFICATION

CAREERS PAGE

WEBSITE

===================

Previous
Next Post »
0 Komentar

Google Tags