NCL
Recruitment 2026: Apply for 270 Assistant Foreman Trainee Posts – Details Here
నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లో 270 అసిస్టెంట్
ఫోర్మెన్ (ట్రైనీ) గ్రేడ్-సి పోస్టులు - జీతభత్యాలు: నెలకు రూ.47,330 + ఇతర అలవెన్సులు.
===================
కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన నార్తర్న్
కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ (NCL).. మధ్యప్రదేశ్ (సింగ్రౌలి), ఉత్తరప్రదేశ్ (సోనభద్ర) జిల్లాల్లోని గనుల్లోని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
విడుదల చేసింది. దీని ద్వారా వివిధ విభాగాల్లో 270 అసిస్టెంట్
ఫోర్మెన్ పోస్టులను పూరించనుంది. అర్హులైన అభ్యర్థులు మార్చి 5వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలి.
వివరాలు:
1. అసిస్టెంట్ ఫోర్మెన్ (E&T) (ట్రైనీ): 14
2. అసిస్టెంట్ ఫోర్మెన్ (మెకానికల్)
(ట్రైనీ): 108
3. అసిస్టెంట్ ఫోర్మెన్ (ఎలక్ట్రికల్)
(ట్రైనీ): 148
మొత్తం ఖాళీల సంఖ్య: 270
అర్హతలు: అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి
మెట్రిక్యులేషన్ (10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు సంబంధిత
ఇంజినీరింగ్ విభాగంలో (ఎలక్ట్రానిక్స్, మెకానికల్ లేదా ఎలక్ట్రికల్) కనీసం
3 సంవత్సరాల డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి. దూరవిద్యా విధానంలో చదివిన వారు
అనర్హులు.
జీతభత్యాలు: ప్రాథమిక వేతనం నెలకు రూ.47,330 + ఇతర అలవెన్సులు.
వయోపరిమితి: చివరి తేదీ నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (ఇది మొత్తం 100 మార్కులకు (70 మార్కులు టెక్నికల్, 30 మార్కులు జనరల్
నాలెడ్జ్/రీజనింగ్) ఉంటుంది, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల
ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: యూఆర్/ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ కు రూ.1,180; ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఎక్స్- సర్విస్మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 11.02.2026.
దరఖాస్తులకు చివరి తేదీ: 05.03.2026.
===================
===================


0 Komentar