Assembly Elections 2026: Assembly Election for 4 States & 1 Union Territory
అసెంబ్లీ ఎన్నికలు 2026: నాలుగు రాష్ట్రాల & ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు
===================
UPDATE 05-05-2026
అసెంబ్లీ ఎన్నికలు 2026 - అధికారిక పూర్తి ఫలితాల వివరాలు
ఇవే
1. పశ్చిమ బెంగాల్ - బెంగాల్ భాజపా రికార్డు విజయం
తూర్పు ప్రాంతంలోని పశ్చిమ బెంగాల్లో భాజపా చరిత్రాత్మక
విజయాన్ని సొంతం చేసుకుంది. మూడింట రెండొంతులకుపైగా మెజారిటీ సాధించింది. బెంగాల్లో
మెజారిటీ మార్కు 147 కాగా.. భాజపా 206 సీట్లు సాధించింది. తృణమూల్ 81 సీట్లకే పరిమితమైంది.
2. కేరళం – యూడీఎఫ్ విజయం
కేరళలో కాంగ్రెస్ పార్టీ ఎగ్జిట్ పోల్స్ ని మించి భారీ
విజయం సాధించింది. పదేళ్ల పినరయి విజయన్ పాలనను ప్రజలు తిరస్కరించారు. కాంగ్రెస్
నేతృత్వంలోని యూడీఎఫ్ 102 స్థానాల్లో విజయం సాధించింది. లెఫ్ట్ కేవలం 35 స్థానాలకే
పరిమితమైంది. కేరళలో కాంగ్రెస్ విజయం సాధించడంతో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై
ఊహాగానాలు మొదలయ్యాయి. రేసులో సతీశన్, కేసీ వేణుగోపాల్ తదితరులున్నారు.
3. అస్సాం - మూడోసారి భాజపా
ఈశాన్యంలో పెద్దన్నలాంటి రాష్ట్రం అస్సాంలో వరుసగా మూడోసారి
కమలం వికసించింది. హిమంత బిశ్వ శర్మ ఒంటి చేత్తో పార్టీకి తిరుగులేని విజయం సాధించిపెట్టారు.
జలూక్బరీలో వరుసగా ఆరోసారి హిమంత గెలిచారు. ఆయనకు లక్షకుపైగా మెజారిటీ వచ్చింది. రాష్ట్రంలో
మెజారిటీ మార్కు 64కాగా భాజపా కూటమి 102 సీట్లలో విజయం సాధించింది. భాజపా సొంతంగా
మెజారిటీ (82) సాధించడం విశేషం.
4. తమిళనాడు - ఎగ్జిట్ పోల్స్ ని తారుమారు – టీవీకే ఆధిపత్యం
మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ ని తారుమారు చేస్తూ... తమిళనాడులో
రెండేళ్ల అనుభవం కూడా లేని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అనూహ్యంగా అధికారానికి
చేరువైంది. రెండు దిగ్గజ పార్టీలైన డీఎంకే, ఏఐఏడీఎంకేలను తోసిరాజని అతి పెద్ద పార్టీగా అవతరించింది. మెజారిటీకి అతి
కొద్ది దూరంలో నిలిచిపోయింది. అనూహ్య పరిణామాలేవైనా జరిగితే తప్ప ఆ పార్టీ అధినేత
విజయ్ ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఆయనకు మద్దతిచ్చేందుకు పలు చిన్న పార్టీలు, ప్రధాన పార్టీలు ముందుకు వచ్చే అవకాశముందంటున్నారు.
విజయ్ ముఖ్యమంత్రి అయితే ఆ పదవి చేపట్టిన తొలి మైనారిటీ నేతగా గుర్తింపు
పొందుతారు.
> విజయ్ పార్టీ టీవీకే 108 సీట్లను సాధించింది. ఆయనకు
ఇంకా 10 సీట్లు కావాల్సి ఉంది. తమిళనాడులో మెజారిటీ మార్కు 118. తాను పోటీ చేసిన
రెండు స్థానాల్లోనూ ఆయన గెలిచారు.
> కొళత్తూరులో పోటీ చేసిన ముఖ్యమంత్రి స్టాలిన్ ఘోరంగా
ఓడిపోయారు. ఆయన తనయుడు, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి
స్టాలిన్ గెలిచారు.
> ఎడప్పాడిలో తలపడిన ఏఐఏడీఎంకే అధినేత పళనిసామి
98వేలకుపైగా ఓట్ల మెజారిటీతో భారీ విజయం సాధించారు.
5. పుదుచ్చేరి - రంగసామిదే
కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి మరోసారి సామాన్యుడైన
అసామాన్యుడు రంగసామికే పట్టం కట్టింది. ఎన్డీయే కూటమిలో ఉన్న ఆయన రెండోసారి వరుసగా
అధికారం చేపట్టనున్నారు. ఈ కూటమి 18 చోట్ల విజయం సాధించింది. యానాంలో ఎన్డీయే
కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు ఘన విజయం సాధించారు.
===================
UPDATE
04-05-2026
అసెంబ్లీ ఎన్నికలు 2026 ఫలితాలు: అధికారిక వెబ్సైట్, యాప్ & ప్రత్యక్ష ప్రసార
వివరాలు
పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, తమిళనాడు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో గత నెల జరిగిన
శాసనసభ ఎన్నికల (Assembly Elections) ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
Live YouTube
Link:
https://www.youtube.com/watch?v=x2FcgIyb3js
===================
భారత దేశంలో
నాలుగు రాష్ట్రాలతోపాటు ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా
మోగింది. తమిళనాడు (234), పశ్చిమ బెంగాల్ (294), కేరళ (140), అస్సాం (126)తోపాటు పుదుచ్చేరి (30) రాష్ట్రాల్లో మొత్తంగా 824 అసెంబ్లీ స్థానాలకు
ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ వివరాలను
వెల్లడించింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది.
పుదుచ్చేరితోపాటు
నాలుగు రాష్ట్రాల శాసనసభల పదవీకాలం మే, జూన్ లో
వేర్వేరు తేదీల్లో ముగియనుంది. ఈ రాష్ట్రాల్లో ఇప్పటికే ఓటర్ల జాబితా ప్రత్యేక
సమగ్ర సవరణ ప్రక్రియను పూర్తి చేసిన ఎన్నికల సంఘం.. క్షేత్ర స్థాయి పరిస్థితులను పర్యవేక్షించేందుకు
ఆయా రాష్ట్రాల్లోనూ ఇటీవల పర్యటించింది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)
జ్ఞానేశ్కుమార్, కమిషనర్లు సుబ్బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషీలు షెడ్యూల్ ప్రకటించారు.
===================
===================





0 Komentar