Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP KGBV Recruitment 2026: Apply for 299 PGT, CRT, PET & Principal Posts – Details Here

 

AP KGBV Recruitment 2026: Apply for 299 PGT, CRT, PET & Principal Posts – Details Here

ఏపీ కేజీబీవీ రిక్రూట్‌మెంట్ 2026: పీజీటీ, సీఆర్టీ, పీఈటీ మరియు ప్రిన్సిపాల్ ఖాళీలు – మొత్తం ఖాళీలు: 299

=====================

UPDATE 16-06-2026

KGBV ఉద్యోగాలకు టెట్ అర్హత లేకున్నా దరఖాస్తు స్వీకరణ & దరఖాస్తు గడువు పొడిగింపు

మే నెలలో విడుదల అయిన KGBV నోటిఫికేషన్ కి సంభంధించి టెట్ & దరఖాస్తు తేదీల అప్డేట్ గురించి తెలుసుకోండి. 

ప్రిన్సిపాల్స్, CRT, PGT పోస్టులకు టెట్ అర్హత లేకున్నా దరఖాస్తు చేయొచ్చని సమగ్ర శిక్ష SPD శ్రీనివాసరావు వెల్లడించారు. ‘అభ్యర్థులకు టెట్ నుంచి తాత్కాలిక మినహాయింపు ఇస్తున్నాం. అలాంటి వారు పోస్టులకు ఎంపికై విధుల్లో చేరిన ఏడాదిలో టెట్ అర్హత సాధించాలి. గడువులోగా సాధించకపోతే వారి సేవలు నిలిచిపోతాయి’ అని స్పష్టం చేశారు. ఈ పోస్టుల దరఖాస్తు గడువును ఈనెల 20వరకు పొడిగించినట్లు తెలిపారు.

=====================

ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) ద్వారా నిర్వహించబడుతున్న కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలలో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బంది పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన (కాంట్రాక్ట్) ఒక సంవత్సరం కాలానికి భర్తీ చేయుటకు అర్హులైన మరియు ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరడమైనది.

ఖాళీల వివరాలు:

ప్రిన్సిపాల్ - 16

పీజీటీ - 98

సీఆర్టీ - 133

పీఈటీ - 52

మొత్తం పోస్టులు: 299 ఖాళీలు

ఆసక్తిగల మహిళా అభ్యర్థులు తమ ఆన్లైన్ దరఖాస్తులను క్రింది వివరాలు గమనించి  దరఖాస్తు చేసుకొనవలెను.  

వయోపరిమితి: ఓపెన్ కేటగిరి అభ్యర్థులకు 18-42 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 సంవత్సరాలు, మాజీ సైనిక ఉద్యోగినులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోపరిమితి సడలింపు కలదు.

దరఖాస్తు రుసుము: రూ.300/-లు

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ: 27/05/2026

దరఖాస్తు చివరి తేదీ: 05/06/2026, 20-06-2026

=====================

DETAILED NOTIFICATION

PRESS NOTE

PROCEEDINGS

WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags