Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Coal India Recruitment 2026: Apply for 660 Management Trainees - Details Here

 

Coal India Recruitment 2026: Apply for 660 Management Trainees - Details Here

కోల్ ఇండియాలో 660 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు - జీత భత్యాలు: నెలకు రూ.60,000 - రూ.1,80,000.

====================

ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్ ఇండియా లిమిటెడ్ (CIL), వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజ్మెంట్ ట్రెయినీ (E-1 గ్రేడ్) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 660 ఖాళీలను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ద్వారా భర్తీ చేయనున్నారు.

మేనేజ్మెంట్ ట్రెయినీ: 660 పోస్టులు

విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, సిస్టమ్, ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్, జియాలజీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, రాజభాష (హిందీ), కంపెనీ సెక్రటరీ.

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ & దివ్యాంగులకు 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. 2025-26 విద్యా సంవత్సరంలో చివరి సెమిస్టర్ చదువుతున్న వారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

గరిష్ఠ వయోపరిమితి: 30 ఏప్రిల్ 2026 నాటికి గరిష్ఠంగా 30 ఏళ్లు ఉండాలి (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ & దివ్యాంగులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది).

జీత భత్యాలు: నెలకు రూ.60,000 - రూ.1,80,000.

దరఖాస్తు రుసుము: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ1,180. ఎస్సీ, ఎస్టీదివ్యాంగులు & కోల్ ఇండియా ఉద్యోగులకు రుసుము లేదు.

ఎంపిక విధానం: కేవలం కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ పరీక్ష (CBT)లో సాధించిన మార్కుల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్ ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు:  

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 12-05-2026.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 11-06-2026.

====================

DETAILED NOTIFICATION

WEBSITE

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags