Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CTET – Central Teacher Eligibility Test – September 2026: All the Details Here

 

CTET – Central Teacher Eligibility Test – 2026 (22nd Edition): All the Details Here

సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) – 2026 (22 వ ఎడిషన్): పూర్తి వివరాలు ఇవే

===================

UPDATE 17-09-2026

CTET 2026 (22 వ ఎడిషన్): పరీక్ష తేదీలు విడుదల

పరీక్ష తేదీలు: 12/12/2026 & 13/12/2026  

WEB NOTE

WEBSITE

===================

UPDATE 07-09-2026

CTET SEP-2026: దరఖాస్తు సవరణకి అవకాశం

దరఖాస్తు సవరణ తేదీలు: 07/09/2026 నుండి 10/09/2026 వరకు

CORRECTION WINDOW

WEB NOTE

WEBSITE

===================

UPDATE 25-08-2026

CTET SEP-2026: దరఖాస్తులకు మరో అవకాశం

CTET 22వ ఎడిషన్కు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి CBSE మరో అవకాశాన్ని కల్పించింది. గతంలో దరఖాస్తు చేసుకోలేకపోయిన అర్హులైన అభ్యర్థుల ప్రయోజనార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు వెల్లడించింది. కొత్త దరఖాస్తు తేదీలు ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 01 వరకు ఆన్లైన్ పోర్టల్ అందుబాటులో ఉంటుంది. గతంలో (మే 11 నుంచి జూన్ 10 వరకు) దరఖాస్తు చేయని అభ్యర్థులు మాత్రమే ఇప్పుడు అప్లై చేసుకోవాలి. ఇప్పటికే అ చేసిన అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. దరఖాస్తుల విండో ముగిసిన తర్వాత 22వ ఎడిషన్ పరీక్ష సవరించిన తేదీని సీబీఎస్ఈ త్వరలో ప్రకటించనుంది.

దరఖాస్తు తేదీలు: 25/08/2026 నుండి 01/09/2026 వరకు

APPLICATION

WEB NOTE

WEBSITE

===================

UPDATE 15-06-2026

CTET SEP-2026: దరఖాస్తు సవరణకి అవకాశం

దరఖాస్తు సవరణ తేదీలు: 15/06/2026 నుండి 18/06/2026 వరకు

CORRECTION WINDOW

WEB NOTE

WEBSITE

===================

సీటెట్ పరీక్షను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్వహిస్తోంది తాజాగా సెప్టెంబర్ 2026 సంబంధించిన పత్రికా ప్రకటన విడుదలైంది.

సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) సెప్టెంబర్ 2026:

పరీక్ష విధానం: పరీక్ష మొత్తం రెండు పేపర్లను కలిగి ఉంటుంది. మొదటి పేపర్ ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునే వారికి కోసం, రెండో పేపర్ ఆరు నుంచి తొమ్మిదో తరగతులకు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు. సీటెట్ స్కోర్ లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. పరీక్షను 20 భాషలలో నిర్వహిస్తారు. సీటెట్ స్కోర్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు.

అర్హతలు:

పేపర్-1: 50 శాతం మార్కులతో పన్నెండో తరగతితో పాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో రెండేళ్ల డిప్లొమా (డీఈఎల్ఈడీ) / డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (ప్రత్యేక విద్య) లేదా డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.

పేపర్-2: 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీతో పాటు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ / బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్ (బీఈడీ) / బీఈడీ (ప్రత్యేక విద్య) లేదా సీనియర్ సెకండరీతో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(బీఈఎల్ ఈడీ)/ బీఎస్సీఈడీ/ బీఏఈడీ/ బీఎస్సీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు రుసుము: జనరల్ / ఓబీసీ కేటగిరీలకు రూ.1000 (పేపర్ 1 లేదా 2 మాత్రమే), రూ.1200 (పేపర్ 1 & 2 రెండూ). ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు: రూ.500 (పేపర్ 1 లేదా 2 మాత్రమే), రూ.600 (పేపర్ 1 & 2 రెండూ).

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 11-05-2026

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 10-06-2026

పరీక్ష తేదీ: 06-09-2026

===================

APPLY HERE

PUBLIC NOTICE

INFORMATION BULLETIN

WEBSITE

===================

Previous
Next Post »
0 Komentar

Google Tags