Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

School Assembly 10th January Information

School Assembly 10th January Information


నేటి ప్రాముఖ్యత 
ప్రపంచ నవ్వుల దినోత్సవం
చరిత్రలో ఈరోజు
➥1920: నానాజాతి సమితిలో భారత్ సభ్యత్వం పొందింది.
➥1973 : ఆంధ్రప్రదేశ్రాష్ట్రం ఐదవ ముఖ్యమంత్రిగా పి.వి. నరసింహారావు పదవీ విరమణ చేసారు.
➥భారతదేశంలో హరిత విప్లవానికి అంకురార్పణ చేసిన వ్యక్తి, భారత రత్న గ్రహీత సి.సుబ్రమణ్యం 1910 వ సం.లో జన్మించారు.
➥భారత దేశ సినీ నేపథ్య గాయకుడు, సంగీత విద్వాంసుడు యేసుదాస్ 1940 వ సం.లో జన్మించారు.
➥ప్రముఖ స్వీడన్ జీవ శాస్త్రవేత్త మరియు వైద్యుడు “కరోలస్ లిన్నేయస్” 1778 వ సం.లో మరణించారు.
➥ఫ్రెంచి గణిత శాస్త్రవేత్త “అడ్రియన్ మేరీ లెజెండ్రీ” 1883 వ సం.లో మరణించారు.
నేటి అంశము:
తిమింగలాలు మనలాగే గాలి పీల్చుకుని బతుకుతాయి
తిమింగలాలు మనలాగే గాలి పీల్చుకుని బతుకుతాయి. తిమింగలం పిల్ల పుట్టీపుట్టడంతో  వాళ్ళమ్మ దాన్ని వెంటనే సముద్రం ఒడ్డుకు నెట్టివేస్తుంది. అప్పుడే పుట్టినందున వాటికి గాలి ఎక్కడ దొరుకుతుందో తెలీదు. ఒకసారి ఒడ్డుమీద శ్వాస తీసుకోవడంతోనే వాటికి జీవిత రహస్యం తెలిసిపోతుంది. తిమింగలం పిల్లలు పుట్టుకతోనే మంచి ఈతగాళ్ళు. గాలి అవసరమనిపించి నప్పుడల్లా వొడ్డుకి ఈదుకొచ్చి కావాల్సినంత గాలి ఊపిరితిత్తుల్లో నింపుకుని మళ్ళీ నీళ్ళలోపలికి వెళ్ళిపోతాయి.
మంచి మాట:
మనం మానసికంగా ఎంత ప్రశాంతంగా ఉంటే మనం చేసే పని అంత ఉత్తమంగా అవుతుంది- హెలెన్‌ కెల్లర్‌


వార్తలలోని ముఖ్యాంశాలు
ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు జనరల్‌ కోటాలో 10% రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన 124వ రాజ్యాంగ సవరణ బిల్లుకు రాజ్యసభ 165-7 ఓట్ల తేడాతో ఆమోదముద్ర వేసింది. ఇప్పటివరకూ 50 శాతంగా ఉన్న రిజర్వేషన్ల పరిధి 60 శాతానికి పెరిగింది. రాజ్యాంగంలో 15(6), 16(6) పేరుతో కొత్త సబ్‌ క్లాజ్‌లు చేరాయి.
దేశవ్యాప్తంగా ఇప్పటికీ ఒకే ఒక్క ఉపాధ్యాయుడు పనిచేస్తున్న ప్రాథమిక పాఠశాలలు లక్ష వరకు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ 7,483 బడులతో 5వ స్థానం, 4,587 పాఠశాలలతో తెలంగాణ 8వ స్థానంలో ఉన్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ తాజా గణాంకాలు చెబుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశంజిల్లాలో రూ.24,000 కోట్లతో నిర్మించనున్న కాగితపు పరిశ్రమకు మరియు రామాయపట్నం పోర్టులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. ఇదిలా ఉండగా విశాఖపట్నంలో డేటా పార్క్‌సోలార్‌ పార్క్‌ల ఏర్పాటుకు రూ.70 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అదానీ గ్రూప్‌ ముందుకొచ్చింది.
బోధన్‌ వాణిజ్య పన్నుల శాఖ సిబ్బంది దళారీ శివరాజ్‌తో కుమ్మక్కయ్యి చేసిన కుంభకోణంలో 5,500 చలానాలను పరిశీలిస్తే అవన్నీ నకిలీవని, కుంభకోణం విలువ రూ.500 కోట్లకు చేరవచ్చని తెలుస్తున్నది. పన్నులు కట్టకపోయినా కట్టినట్లు రికార్డుల్లో చూపించడంతో ప్రభుత్వం భారీగా నష్టపోయింది.
ఐసీసీ వన్డే ర్యాంకుల్లో బ్యాటింగ్‌ జాబితాలో కోహ్లీ, రోహిత్‌ శర్మ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. బౌలింగ్‌ విభాగంలో జస్ప్రీత్‌ బుమ్రా అగ్రస్థానంలో ఉండగా కుల్‌దీప్‌ యాదవ్‌ మూడో ర్యాంకులో నిలిచాడు.
అధికారంలోకి వస్తే నవరత్నాలతో ప్రతి పేదవాడిని ఆదుకుంటామని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. 3,648 కిలోమీటర్లు సాగిన చారిత్రాత్మక పాదయాత్ర ముగిసిన సందర్భంగా ఇచ్ఛాపురంలో ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పై వ్యాఖ్యలు చేశారు.
ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మకర సంక్రాంతి నుంచి మహా శివరాత్రి వరకు సాగే అర్ధ  కుంభమేళాకు కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు. అలహాబాద్‌ను పేరును ప్రయాగ్‌రాజ్‌గా మార్చిన తర్వాత జరిగే తొలి అర్ధ కుంభమేళా ఇదే.


పైన తెలిపిన సమాచారం మొత్తం వాయిస్(voice) రూపంలో వినిపించడానికి క్రింద ఇచ్చిన ప్లే బటన్ ఫై క్లిక్ (click)చేయండి.
సూచన:ఈ ఆడియో లోడ్ అవ్వడానికి ఆయా నెట్వర్క్ స్పీడ్ ఆధారంగా కొంత సమయం పట్టవచ్చు.


  • SCHOOL ASSEMBLY:10th January(నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట)
  • SCHOOL ASSEMBLY:10th January(వార్తలలోని ముఖ్యాంశాలు)

  • School Assembly 10th January Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,January month school assembly day wise,January 2019 school assembly,January 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 10th January 2019 assembly, 10th January 2019 assembly,news of the day history,news of the day highlights,10th dec 2019 assembly, dec 10th assembly, dec 10th historical events, 10th January 2019 assembly, january 10th assembly, january 10th historical events,school related today assembly,school related today news, school related january 10th information, school related january month information, School Assembly 10th Jan Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,Jan month school assembly day wise,Jan 2019 school assembly,Jan 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 10th Jan 2019 assembly, 10th Jan 2019 assembly,news of the day history,news of the day highlights,10th dec 2019 assembly, dec 10th assembly, dec 10th historical events, 10th Jan 2019 assembly, jan 10th assembly, jan 10th historical events,school related today assembly,school related today news, school related jan 10th information, school related jan month information
    Previous
    Next Post »
    0 Komentar

    Google Tags