Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

National Digital Library of India


National Digital Library of India
విజ్ఞానాన్ని పంచుతున్న ఎన్ డీఎల్
ఒకే సైట్లో అన్ని రకాల పుస్తకాలు, కరోనా వేళ బయటకు వెళ్లకుండా చదువుకునే అవకాశం, 12 భాషల్లో నాలుగు కోట్ల పుస్తకాలు. డిజిటల్ పుస్తకాలను చదువుకోవడం చాలా సులభం, గూగుల్లో ఎన్ డీఎల్ ఆఫ్ ఇండియా అని టైప్ చేసి వెబ్ పేజీని ప్రారంభించాలి. అందులో ఈ-మెయిల్ ఐడీ సాయంతో రిజి స్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. తాము చదువుతున్న విశ్వవిద్యాలయం, అవసరమైన పుస్తకాల జాబితాను ఎంపిక చేసుకోవాలి. తర్వాత రిజిస్ట్రేషన్ చేసిన నమోదుకు ఇచ్చిన మెయిలకు గ్రంథాలయ లింక్ వెళ్తుంది. అందులో క్లిక్ చేసి లాగిన్, పాస్ వర్డ్ ఎంటర్ చేసి వెళ్లిచ్చు. తర్వాత అవసరమైన పుస్తకాలను ఎంపిక చేసుకుని చదువుకోవచ్చు. లేదా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఫోన్లో అయితే గూగుల్ ప్లే స్టోర్ లో ఎడీఎల్ ఆఫ్ ఇండియా అనే యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. ఐఐటీ, జేఈఈ, గేట్ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారి కోసం ప్రత్యేకంగా పుస్తకాలను ఉంచారు. ఈ సైట్లో తెలుగు సహా 12 భాషలకు సంబంధించి నాలుగు కోట్లకు పైగా పుస్తకాలను పొందుపర్చారు. ఎందరో ప్రముఖులకు చెందిన 3లక్షల పుస్తకాలతో పాటు పోటీ పరీక్షల పుస్తకాలు, యూనివర్సిటీ, పాఠశాల  బోర్డుల ప్రశ్న పత్రాలు, సమాధాన పుస్తకాలు, కంప్యూటర్ సైన్స్, బీఎడ్, డీఎడ్, పుస్తకాలతో పాటు సాహిత్య పుస్తకాలను చూడొచ్చు. ఆర్టికల్స్, వీడియో, ఆడియోల రూపంలో ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి.
వెబ్ సైట్:

Previous
Next Post »
0 Komentar