Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

National Career Service portal & Android app

National Career Service portal & Android app

➤నిరుద్యోగులు వారి అర్హతలకు తగిన ఉద్యోగాలను త్వరగా పొందటం కొరకు కేంద్ర ప్రభుత్వం లేబర్ మరియు ఎంప్లాయిమెంట్ విభాగం ఆధ్వర్యంలో నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్ ను మరియు National Career Service(NCS) ఆండ్రాయిడ్ యాప్ ను ప్రారంభించింది.
➤నిరుద్యోగులు మొదట https://www.ncs.gov.in వెబ్ సైట్ లో (లేదా) National Career Service(NCS) ఆండ్రాయిడ్ యాప్ లో రిజిష్టర్ అవ్వాలి. 
➤ఆ తరువాత అర్హతలను నమోదు చేసి అర్హతకు తగిన ఉద్యోగాలను చూసుకొని ఆప్షన్లను సెలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
➤ఆ తరువాత ఆప్షన్లను పూర్తి చేసి సెక్యూరిటీ కోడ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
➤వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేసిన తరువాత 19 నంబర్లు గల యూజర్ ఐడీ వస్తుంది. ఆ తరువాత ఈ పోర్టల్ లోకి లాగిన్ అవటం ద్వారా ఉద్యోగాల సమాచారం పూర్తిగా తెలుసుకోవచ్చు. 
➤ఈ వెబ్ సైట్ లో ఇప్పటికే చాలా కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వటం కొరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. కోటి మందికి పైగా నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఈ వెబ్ సైట్ లో వివరాలు నమోదు చేసుకున్నారని తెలుస్తోంది.
➤ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అర్హతలు మరియు పూర్తి వివరాలు ఈ వెబ్ సైట్ లో దొరుకుతాయి. 
➤ప్రభుత్వ రంగంలోని ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ రంగంలోని ఉద్యోగాలు కూడా ప్రతిరోజు ఈ వెబ్ సైట్ లో (లేదా) National Career Service(NCS) ఆండ్రాయిడ్ యాప్ అప్ డేట్ అవుతూ ఉంటాయి. 
➤పూర్తి సమాచారం కొరకు ప్రభుత్వం 18004251514 అనే టోల్ ఫ్రీ నంబర్ ను అందుబాటులోకి తెచ్చింది. నిరుద్యోగులకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. ఎంప్లాయిమెంట్ ఎక్ఛెంజ్ నిర్వహించే జాబ్ మేళాల వివరాలు కూడా ఈ వెబ్ సైట్ లో లభిస్తాయి.

Previous
Next Post »
0 Komentar

Google Tags