Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

New features in what's app

మేజిక్​ మెసేజ్​... వాట్సాప్​లో మరో అద్భుత ఫీచర్


వాట్సాప్​ యూజర్లకు మరో అద్భుత ఫీచర్అందుబాటులోకి వచ్చే అవకాశముంది. వ్యక్తిగత, గ్రూప్​ సంభాషణల్లో.. యూజర్లు పంపే సందేశాలు అవతలి వారికి ఎంత సేపు కనిపించాలో ముందుగానే నిర్ణయించే సదుపాయం వినియోగంలోకి తెచ్చేందుకు వాట్సాప్​ ప్రయత్నిస్తోంది.
ఒక వాట్సాప్ యూజర్​ మరో వాట్సాప్ యూజర్​కు సందేశాలు పంపే ముందు తన మెసేజ్​ అవతలి వ్యక్తికి ఎంత సేపు కనిపించాలి అనేది ముందుగానే నిర్ణయించొచ్చు. ఇలా ఈ ఫీచర్​ను ఉపయోగించి పంపిన సందేశాలు 5 సెకన్ల నుంచి గంట వ్యవధిలో వాటంతట అవే డిలీట్​ అవుతాయి. తాత్కాలిక అవసరాలకు పంపే సందేశాలకు ఈ ఫీచర్​ ఎంతో ఉపయోగపడనుంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags