Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

October 12 - The day when the Right to Information Act comes into force

October 12 - The day when the Right to Information Act comes into force

అక్టోబర్ 12 -  సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చిన రోజు
"సమాచార హక్కు చట్టం" ప్రభుత్వం చేసిన ప్రతి పనిని తెలుసుకునేందుకు ప్రజలకు ఇచ్చిన హక్కు ఇది.
      సమాచార చట్టం-2005 ప్రకారం మీరు ఏ పబ్లిక్ అథారిటీ నుంచి అయినా సమాచారం కోరవచ్చు. (పబ్లిక్ అథారిటీ అంటే ప్రభుత్వ సంస్థ, లేదా, ప్రభుత్వ ఆర్ధిక సహాయంతో నడిచే సంస్థ) సమాచారం కోసం కోరడమెలాగో తెలుసుకోండి.
● దరఖాస్తు ఫారాన్ని వ్రాయాలి, లేదా టైప్ చేయాలి. వికాస్ పీడియా పోర్టల్ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. దరఖాస్తు ఇంగ్లీషు, హిందీ, లేదా ఏదైనా రాష్ట్రానికి చెందిన భాషలోనే వుండాలి.
మీ దరఖాస్తులో ఈ కింది సమాచారాన్ని తెలియజేయండి.
➤ సహాయ పౌర సమాచార అధికారి (ఏ పి ఐ ఓ) / పౌర సమాచార అధికారి (పి ఐ ఓ) పేరు,
➤ కార్యాలయం చిరునామా
➤ విషయం : దరఖాస్తు-సమాచార చట్టం-2005 సెక్షన్ 6(1) ప్రకారం పబ్లిక్ అథారిటీనుంచి మీకు కావలసిన సమాచారం వివరాలు
➤ దరఖాస్తుదారు పేరు
➤ తండ్రి / భర్త పేరు
➤ కేటగిరి: ఎస్సీ / ఎన్టీ/ ఓబిసి
➤ దరఖాస్తు రుసుము
➤ మీరు పేద (బిపిఎల్) కుటుంబానికి చెందినవారా? అవును | కాదు
➤ మీ పోస్టల్ చిరునామా,
➤ మొబైల్ ఫోన్ నంబరు,
➤ ఇ-మెయిల్ ఐడి (అయితే, ఇ-మెయిల్ ఐడి ని పేర్కొనడం తప్పనిసరి కాదు)
➤ తేదీ,
➤ ఊరు
➤ దరఖాస్తుదారు సంతకం
➤ జతపరుస్తున్న పత్రాల జాబితా
● దరఖాస్తు దాఖలుచేసే ముందు సహాయ పౌర సమాచార అధికారి/ పౌర సమాచార అధికారి పేరు, నిర్దేశించిన సుంకం, చెల్లించవలసిన తీరు సక్రమంగా వున్నది లేనిది సరిచూసుకోండి.
● సమాచార హక్కు (ఆర్టిఐ) చట్టం కింద, సమాచారం పొందడానికి దరఖాస్తు రుసుం చెల్లించవలసి వుంటుంది. అయితే, ఎస్సి/ ఎస్టి / బిపిఎల్ కుటుంబాలకు చెందినవారికి సుంకంనుంచి మినహాయింపు వుంది.
● సుంకం మినహాయింపు కోరేవారు ఎస్ సి / ఎస్ టి / బి పి ఎల్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీని జతచేయవలసి వుంటుంది.
● దరఖాస్తును స్వయంగా, లేదా పోస్టు ద్వారా, లేదా ఇ-మెయిల్ ద్వారానైనా పంపవచ్చు. పోస్టుద్వారా పంపదలచుకుంటే, రిజిస్టర్డ్ పోస్టుద్వారానే పంపాలి. కొరియర్ ద్వారా పంపవద్దు.
● దరఖాస్తు పత్రాలకు (అంటే, దరఖాస్తు ఫారము, సుంకం చెల్లింపు రసీదు, స్వయంగా లేదా పోస్టు ద్వారా దరఖాస్తు సమర్పించినట్టు రసీదు) రెండు జిరాక్స్ కాపీలు తీయించుకుని తర్వాతి అవసరాలకు వీలుగా మీ వద్ద వుంచుకోండి.
● మీరు స్వయంగా దరఖాస్తు అందజేస్తుంటే, ఆ కార్యాలయం నుంచి రసీదు తీసుకోండి. ఆ రసీదుపై తేదీ, ఆ కార్యాలయం ముద్ర స్పష్టంగా వుండేలా జాగ్రత్త వహించండి.
● దరఖాస్తును పోస్ట్ ద్వారా పంపదలచుకుంటే, దానిని రిజిస్టర్డ్ పోస్టులో పంపి ఆ రసీదును భద్రంగా వుంచుకోండి. ఆ దరఖాస్తు పౌర సమాచార అధికారికి అందిన తేదీనుంచి, సమాచారం అందజేయడానికి గడువును లెక్కించడం జరుగుతుంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags