Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Income tax refund

Income tax refund


ఆదాయపు పన్ను రీఫండ్
*రూ. 5 లక్షలలోపు అన్ని పెండింగ్ రిఫండ్లు తక్షణమే చెల్లింపు
        కోవిడ్-19 ప్రభావం నేపథ్యంలో కేంద్రప్రభుత్వం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. రూ.5 లక్షల వరకు పెండింగ్ లో ఉన్న వ్యక్తిగత, వ్యాపార సంస్థల ఆదాయ పన్ను రీఫండ్ ను తక్షణమే విడుదల చేయనున్నట్లు ఆదాయ పన్ను విభాగం ప్రకటించింది. యాజమాన్యాలు చెల్లించే జీతాల కోసం ఎదురుచూస్తున్నవారు, చెల్లింపుల్లో కోత ఎదుర్కొంటున్నవారు లేదా ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం ఎదుర్కొంటున్న వ్యక్తులకు ఉపశమనం కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది.

    ఇప్పటివరకూ పెండింగ్ లో ఉన్న రూ. 18వేల కోట్ల పన్ను రీపండు వెంటనే చెల్లించనుంది. దీనివల్ల 14 లక్షల మందికి ప్రయోజనం కలగనుంది. అన్ని రకాల జీఎస్టీ, కస్టమ్స్ రీఫండ్ బకాయిలనూ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Previous
Next Post »
0 Komentar