Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

huge price cut on lpg cylinder


భారీగా తగ్గిన వంట గ్యాస్ ధర
వంట గ్యాస్ వినియోగదారులకు మరో సారి ఊరట లభించింది. నెలవారీ సమీక్షలో భాగంగా  చమురు మార్కెటింగ్ సంస్థలు సిలిండర్ ధరను భారీగా తగ్గించాయి. సవరించిన  రేట్లు  ఈ రోజు నుంచే  (మే 1) నుంచే అమల్లోకి వచ్చాయి.  హైదరాబాదులో 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండ‌ర్ ధ‌ర రూ. 207 త‌గ్గి  రూ. 589.50 నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. కమ‌ర్షియ‌ల్ గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర కూడా రూ. 336 క్షీణించి ప్రారంభ ధ‌ర రూ. 988 కి చేరింది. న్యూఢిల్లీలో ఎల్‌పిజి సిలిండర్ ధర 744 నుంచి తగ్గి  రూ. 581.50 గా వుంటుంది. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ధ‌ర‌లు, డాలర్ మారకంలో రూపాయి విలువ ఆధారంగా  గ్యాస్ సిలిండ‌ర్ ధ‌రలు మారుతూ వుంటాయి.
జిల్లాల వారి తగ్గిన ధర సుమారుగా (రూపాయలలో)
అనంతపురం- 124
చిత్తూరు -  188
కడప-  208
తూర్పుగోదావరి-179
గుంటూరు-180
కృష్ణా-183.5
కర్నూలు-205.5
నెల్లూరు-176.5
ప్రకాశం-190.5
శ్రీకాకుళం-179
విశాఖపట్నం-192
విజయనగరం-172
పశ్చిమగోదావరి-190.5

Previous
Next Post »
0 Komentar

Google Tags