Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

How to wake up early in the morning



If you do this, you will definitely wake up in the morning

ఈ టిప్స్ ఫాలో అయితే కచ్చితంగా ఉదయం త్వరగా నిద్రలేస్తారు

లైఫ్‌లో సక్సెస్ అయ్యేందుకు ఉదయాన్నే నిద్ర లేవడం కూడా ఓ కారణమే. కొంతమంది ఎంత ట్రై చేసినా లేవలేరు. అలాంటి వారు ఈ టిప్స్ పాటించండి..

వాతావరణం చల్లబడడంతో పొద్దున్నే లేవాలంటే కొంత మందికి బద్ధకం గా ఉంటుంది. అదే టైమ్‌లో ఇలాంటివేం పట్టించుకోకుండా ప్రతి రోజూ పొద్దున్నే ఒకే టైమ్‌కి లేచే వాళ్ళని చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కొంచెం జెలసీ గా కూడా ఉంటుంది. ఎందుకంటే, అన్ని కబుర్లు చెప్పినా పొద్దున్నే లేవడం మంచిదని అందరికీ తెలిసిన విషయమే. కానీ, పెందరాళే లేవడం మరీ అంత కష్టమేం కాదు. ఇక్కడ ఇచ్చిన టిప్స్ ఫాలో అయిపోతే రోజూ సూర్యోదయాన్ని ఎంజాయ్ చేస్తూ కాఫీ తాగొచ్చు.

1. ముందుగా నిద్ర..
రాత్రి తొందరగా పడుకుంటే పొద్దున్న తొందరగా లేవడం ఈజీ అవుతుంది. అందుకని, రోజూ పడుకునే టైమ్ కంటే ఒక పావు గంట ముందు పడుకుని ఒక పావు గంట ముందుగా లేవడం మొదలుపెట్టండి. పడుకోవడానికి గంట ముందు నించే లైట్స్ ఆఫ్ చేసి, ఫోన్/లాప్టాప్ పక్కన పెట్టేయండి. నిద్ర పోవడానికి అరగంట ముందు వెచ్చగా పాలు తాగడం ఎంతో హెల్ప్ చేస్తుంది. అలారం మీకు చేతికి అందేట్లు కాకుండా దూరంగా పెట్టుకుంటే అలారం ఆపేటప్పటికి మెలకువ వచ్చేస్తుంది. ఆదివారం, సోమవారం తో సంబంధం లేకుండా ఇదే రొటీన్ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి.

2. ప్రిపరేషన్స్..
తొందరగా పడుకోవాలంటే మీకు కొన్ని ప్రిపరేషన్స్ అవసరమవుతాయి. స్క్రీన్ టైం ని తగ్గించడం తో పాటూ నిద్రకి ముందు ఆకలిగా కానీ, కడుపు నిండుగా కానీ లేకుండా చూసుకోవాలి. రేపటి స్కూల్ కీ, ఆఫిసుకీ సంబంధించిన ప్రిపరేషన్స్, బ్రేక్ ఫాస్ట్ కి కావాల్సిన పదార్ధాలు తయారుగా పెట్టుకోవడం వంటివి హెల్ప్ చేస్తాయి.

3. లేచాక ఏం చేయాలో ఆలోచించడం..
మీరు చేద్దామనుకున్న దాని మీద మీరు లేవడం ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మీకు బాగా ఉత్సాహంగా ఉన్న పనిని పొద్దున్నే షెడ్యూల్ చేసుకోండి. ప్రేయర్, ఎక్సర్సైజింగ్, రైటింగ్, రీడింగ్, కొత్తవేమైనా నేర్చుకోవడం వంటి పనులను పొద్దున్నే పెట్టుకుంటే మీకూ ఉల్లాసంగా ఉంటుంది. లేచాక చేయడానికి పనేమీ లేకపోతే మళ్ళీ నిద్ర వచ్చేస్తుంది.


4. కొన్ని టెక్నిక్స్ ఫాలో అవ్వండి..
నిద్ర లేచాక మళ్లీ నిద్ర రాకుండా ఉండేందుకు కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. లేవగానే దుప్పటి మడత పెట్టి, బెడ్ సరి చేయడం మొదటిది. అన్నీ సర్దేశాక మళ్ళీ పడుకుని దాన్ని చెదరగొట్టాలని తొందరగా అనిపించదు. కర్టెన్స్ ఓపెన్ చేసి సన్ లైట్ ని లోపలికి ఇన్వైట్ చేయడం రెండవది. ఆ తరువాత బ్రష్ చేసుకుని ముఖం చల్లని నీటితో కడుక్కున్నారంటే నిద్ర పూర్తిగా పారిపోతుంది. అప్పుడు వేడిగా కాఫీ కానీ, నిమ్మ రసం పిండిన వేడి నీరు కానీ తాగితే ఫ్రెష్ గా ఉంటుంది.

5. ఎక్సర్‌సైజ్..
పొద్దున్న లేచాక ఎక్సర్సైజ్ చేస్తే మీరు హెల్దీ రొటీన్ లోకి అడుగుపెట్టినట్టే. రాత్రి నిద్రకు ముందే ఎక్సర్సైజ్ కి కావాల్సినవన్నీ - డ్రెస్, షూస్, మ్యూజిక్ - రడీగా పెట్టుకోండి. ఎక్సర్సైజ్ ముందూ తరువాతా కూడా నీళ్ళు తాగడం మర్చిపోకండి.

6. మంచి బ్రేక్ ఫాస్ట్..
పొద్దున్నే లేచే వాళ్ళు అస్సలు చేయకూడని పని బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడం. బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే లేవడానికి తినడానికీ మధ్య చాలా టైం ఉంటుంది. అది హెల్త్ కి మంచిది కాదు. ప్రోటీన్స్ తో నిండి ఉన్న బ్రేక్ ఫాస్ట్ మీకు రోజంతటికీ కావాల్సిన శక్తినిస్తుంది.

7. సహనంగా ఉండడం..
ఏ పనైనా ఇవాళ అనుకుంటే రేపటి నించే చేయగలిగిన వాళ్ళు కొంతమందే ఉంటారు. ఈ కొత్త రొటీన్ అలవాటవ్వడానికి కొంత టైం పడుతుంది. ఈ లోపే మీరు మళ్ళీ పాత అలవాటులోకి వెళ్ళిపోకుండా జాగ్రత్త పడండి. పొద్దున్నే లేవడం వల్ల ఎంత టైం మీ చేతిలోకి వచ్చిందో, ఆ టైం లో మీరెన్ని పనులు చేయగలిగుతున్నారో గమనించుకుంటూ ఉండండి. ఇది మీకు మంచి ఉత్సాహాన్నిస్తుంది.
Previous
Next Post »
0 Komentar

Google Tags