Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Good News: Center ready for interest waiver during moratorium period


Good News: Center ready for interest waiver during moratorium period
మారటోరియం కాలంలో వడ్డీ మాఫీకి సిద్ధమైన కేంద్రం.. వారికి కూడా వర్తింపు!
కరోనా నేపథ్యంలో రుణాల చెల్లింపులపై ఈ ఏడాది ఆగస్టు 31 వరకు ఆర్బీఐ మారటోరియం సౌకర్యం కల్పించి, చెల్లింపుల కాల పరిమితిని పెంచింది. కానీ, రుణాలపై వడ్డీలను మాఫీ చేసేది లేదని స్పష్టం చేసింది.

లాక్‌డౌన్ సమయంలో బ్యాంకు రుణాలపై కేంద్రం ఆరు నెలల పాటు మారిటోరియం విధించిన విషయం తెలిసిందే. అయితే, ఈ రుణాల వడ్డీపై వడ్డీని మాఫీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు శుక్రవారం తెలియజేసింది. దీంతో వ్యక్తిగత, చిన్న, మధ్యతరహా రుణగ్రహీతలకు పెద్ద ఉపశమనం కలగనుంది. అంతేకాదు, మార్చి- ఆగస్టు మధ్యకాలంలో రుణ వాయిదాలు చెల్లించిన వారికి కూడా ఈ ప్రయోజనం వర్తింపజేయనుంది.

చిన్న రుణగ్రహీతలను ఆదుకునే సంప్రదాయాన్ని కొనసాగించాలని, బ్యాంకు రుణాలపై వడ్డీ లేదా వాయిదాలపై వడ్డీపై వడ్డీని మాఫీ చేయడం వల్ల కలిగే భారాన్ని భరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తన అఫిడవిట్‌లో పేర్కొంది. రూ.2 కోట్ల వరకు ఎంఎస్ఎంఈ రుణాలు, వ్యక్తిగత రుణాలు, విద్యా రుణాలు, గృహ రుణాలు, వినియోగదారుల రుణాలు, క్రెడిట్ కార్డ్ బకాయిలు, ఆటో రుణాలు, నిపుణుల వ్యక్తిగత రుణాలు, వినియోగ రుణాలు ఈ వర్గం వడ్డీ మాఫీ అవుతుందని కేంద్ర ఆర్ధిక శాఖ తెలిపింది.

లాక్‌డౌన్ సమయంలో ఆరు నెలల పాటు రుణాలపై ఆర్బీఐ మారిటోరియం విధించగా.. పలు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు ఈ మొత్తానికి వడ్డీ వసూలు చేస్తున్నాయి. వడ్డీ సాధారణంగా ముందే నిర్ణయించడంతో రుణగ్రహీతలకు భారమవుతోంది. అంతేకాదు, అధిక వడ్డీ రేట్ల వల్ల క్రెడిట్ కార్డు చెల్లింపుల్లోనూ భారీ పెరుగుదల ఉంది. వడ్డీ మినహాయింపు ప్రయోజనం ఈ వర్గాలకు మాత్రమే పరిమితం చేస్తే సుమారు రూ.5,000-6,000 కోట్లు ఉంటుందని బ్యాంకర్లు తెలిపారు.

అయితే, ఈ పథకాన్ని రుణగ్రహీతలందరికీ విస్తరిస్తే, మాఫీ మొత్తం ఖర్చు రూ .10,000-15 వేల కోట్ల మధ్య ఉంటుంది. ఇది సాంఘిక సంక్షేమ కార్యక్రమం కాబట్టి వడ్డీ మినహాయింపును కేంద్రం భర్తీ చేస్తుందని బ్యాంకర్లు ఆశిస్తున్నారు. మారిటోరియం సమయంలో ఈఎంఐలు లేదా క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించే వారికి ఎలా ప్రయోజనం కలుగుతుందో స్పష్టత లేదు. మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రాజీవ్ మెహ్రీషి నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫారసులను అనుసరించి కేంద్రం తన వైఖరిని వెల్లడించింది.

అంతకు ముందు, వడ్డీపై వడ్డీని మాఫీ చేయడాన్ని కేంద్రం, ఆర్బీఐ వ్యతిరేకించాయి. ఇతరుల ముఖ్యంగా డిపాజిటర్ల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటుందని, బకాయిలు చెల్లించిన వారికి అన్యాయం జరుగుతుందని పేర్కొన్నాయి. దీనిపై జస్టిస్ అశోక్ భూషణ్, ఆర్ఎస్ రెడ్డి, ఎం ఆర్ షాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం వడ్డీపై వడ్డీని వదులుకోవద్దని తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కేంద్రం, ఆర్బీఐకి సూచించింది.
Previous
Next Post »
0 Komentar

Google Tags