Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Half of working adults worried about jobs, 2/3rd expect employers to help them retrain: WEF

 


Half of working adults worried about jobs, 2/3rd expect employers to help them retrain: WEF

ఉద్యోగం ఉంటుందో.. ఊడుతుందో..!

ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ ప్రజలు తమ ఉద్యోగ భద్రత విషయంలో ఆందోళనకు గురవుతున్నట్లు ప్రముఖ సర్వే వెల్లడించింది. 

కరోనా ఎఫ్టెక్ట్‌: ఉద్యోగుల ఆందోళన

అభద్రతా భావంలో మెజారిటీ ఉద్యోగులు

కొత్త ఉపాధి అవకాశాలపై ఆశాభావం

వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి 

ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావంతో అనేక సంస్థలు మూతబడ్డాయి.. లక్షల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. కుటుంబాలు ఛిన్నాభిన్నమయ్యాయి. అయితే.. పరిస్థితులు ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్నాయి. కానీ ఉద్యోగుల్లో మాత్రం ఆందోళన తగ్గట్లేదు. ఉద్యోగాలు ఉంటాయా.. పోతాయా అనే టెన్షన్‌తోనే గడుపుతున్నారు. 

ఇండియాలో 57 శాతం:

ఉద్యోగాలు పోతాయనే ఆందోళన పడుతున్న వాళ్ల సంఖ్య వందలు, వేలల్లో కాదు.. ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ ప్రజలు తమ ఉద్యోగ భద్రత విషయంలో ఆందోళనకు గురవుతున్నారు. వచ్చే 12 నెలల్లో తాము ఉపాధి కోల్పోయే అవకాశాలు ఉన్నాయని 54 శాతం మంది భావిస్తున్నారు. భారత్‌ విషయంలో ఇది 57 శాతంగా ఉంది. ఉద్యోగాలను కోల్పోతామని ఆందోళన పడుతున్న వారిలో దాదాపు 70 శాతం మంది.. కొత్త ఉపాధి అవకాశాలను పొందడంలో తమ యాజమాన్యాలు సహకరిస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుండడం మరో విశేషం. 

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సర్వే:

ఈ మేరకు వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ ‘జాబ్స్‌ రిసెట్‌ సమ్మిట్‌’లో విడుదలైన ఆన్‌లైన్‌లో జరిగిన గ్లోబల్‌ సర్వే ఈ అంశాలను తెలియజేసింది. దాదాపు 27 దేశాల్లో 12,000కు పైగా ఉద్యోగులపై ఈ సర్వే నిర్వహించారు. ఇందులో వెల్లడయిన విషయాలు ఏంటంటే.. రష్యాలో సగటున ప్రతి నలుగురు ఉద్యోగుల్లో ముగ్గురు ఉద్యోగ అభద్రతా భావంలో ఉన్నారు. జర్మనీ విషయంలో ఈ సంఖ్య ఒకటిగా ఉంది. భారత్‌లో 57 శాతం మంది తమ ఉద్యోగ భద్రతపై ఆందోళన ఉంటే.. వీరిలో 25 శాతం మందిలో ఆందోళన తీవ్రంగా ఉంది. 31 శాతం మందిలో ఒక మోస్తరుగా ఉంది. 

ఆందోళనలో రష్యా టాప్‌:

ఉపాధి అవకాశాలపై ఆందోళనకు సంబంధించి 75 శాతంతో రష్యా టాప్‌లో ఉంది. తరువాతి స్థానంలో స్పెయిన్‌ (73 శాతం), మలేషియా (71 శాతం) ఉన్నాయి. అత్యంత తక్కువగా ఉన్న కింద స్థాయి నుంచి చూస్తే, జర్మనీ (26 శాతం), స్వీడన్‌ (30 శాతం), నెథర్లాండ్స్, అమెరికా (36 శాతం) ఉన్నాయి. 

తమ ప్రస్తుత యాజమాన్యం ద్వారా భవిష్యత్‌ ఉద్యోగం పొందడానికి తగిన, అవసరమైన నైపుణ్యతను పెంచుకోగలుగుతున్నట్లు ప్రపంచవ్యాప్తంగా 67 శాతం మంది ఉద్యోగులు పేర్కొన్నారు. ఈ విషయంలో మొదటి స్థానంలో మొదటి స్థానంలో స్పెయిన్‌ (86 శాతం) ఉంది. తరువాతి స్థానాల్లో పెరూ (84%), మెక్సికో (83%), భారత్‌ (80%) ఉన్నాయి. జపాన్‌ ఈ విషయంలో 45 శాతంగా ఉంటే, స్వీడన్‌ 46 శాతంగా ఉంది. రష్యా విషయంలో ఇది 48 శాతం. దీన్ని బట్టి చూస్తే ఉద్యోగులు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్లు అర్థమవుతోంది. అవసరం అన్నీ నేర్పిస్తుంది అంటే ఇదేనేమో..!,

Previous
Next Post »
0 Komentar

Google Tags