Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

South Western Railway Recruitment 2020 Sports Quota Vacancy

 

South Western Railway Recruitment 2020 Sports Quota Vacancy

రైల్వే జాబ్స్.. సౌత్‌ వెస్ట్ర‌న్ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

సౌత్ వెస్ట్ర‌న్ రైల్వే స్పోర్ట్స్‌కోటా ద్వారా 21 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

హుబ్లీ ప్ర‌ధాన కేంద్రంగా ఉన్న సౌత్ వెస్ట్ర‌న్ రైల్వే (ఎస్‌డ‌బ్ల్యూఆర్) స్పోర్ట్స్‌కోటా ద్వారా 21 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. అథ్లెటిక్స్‌, బ్యాట్‌మెంట‌న్‌, క్రికెట్‌, వెయిట్ లిఫ్టింగ్‌, టెబుల్ టెన్నిస్‌, ‌హాకీ తదితర క్రీడాంశాలకు సంబంధించిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప‌దోత‌ర‌గ‌తి/ ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌తతోపాటు సంబంధిత క్రీడ‌ల్లో జాతీయ‌/ అంత‌ర్జాతీ స్థాయిలో ఆడి ఉన్న వారు అర్హులు. ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబర్‌ 28 దరఖాస్తుకు చివరితేది. పూర్తి వివరాలకు https://www.rrchubli.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు. 

మొత్తం ఖాళీలు: 21

అథ్లెటిక్స్‌ (మెన్‌) - 3

అథ్లెటిక్స్‌ (ఉమెన్‌) - 2

బ్యాడ్మింటన్‌ (మెన్‌) - 2

క్రికెట్‌ (మెన్‌) - 3

వెయిట్‌ లిఫ్టింగ్‌ (మెన్‌) - 2

టేబుల్‌ టెన్నిస్‌ (మెన్‌) - 1

హాకీ (మెన్‌) - 4

స్విమ్మింగ్‌ (మెన్‌) - 2

గోల్ఫ్‌ (మెన్‌) - 2 

ముఖ్య సమాచారం:

క్రీడాంశాలు: అథ్లెటిక్స్‌, బ్యాట్‌మెంట‌న్‌, క్రికెట్‌, వెయిట్ లిఫ్టింగ్‌, టెబుల్ టెన్నిస్‌, ‌హాకీ త‌దిత‌ర విభాగాల్లో ఉన్నాయి.

అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తి/ ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌తతోపాటు సంబంధిత క్రీడ‌ల్లో జాతీయ‌/ అంత‌ర్జాతీ స్థాయిలో ఆడి ఉండాలి.

వ‌య‌సు: 01.01.2021 నాటికి 18-25 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఫీల్డ్ ట్ర‌య‌ల్స్‌, క్రీడా విజ‌యాల మ‌దింపు, మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

చిరునామా: రైల్వే రిక్రూట్‌మెంట్‌సెల్, 2 వ అంతస్తు, పాత జీఎం ఆఫీస్ బిల్డింగ్ క్లబ్ రోడ్, హుబ్లీ-582323.

చివ‌రి తేది: డిసెంబర్‌ 28, 2020

వెబ్‌సైట్‌: https://www.rrchubli.in/

NOTIFICATION 

Previous
Next Post »
0 Komentar

Google Tags