Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ఎస్ఎస్‌సీ ఉద్యోగ పోటీ పరీక్షల కోసం తెలుగు, ఆంగ్లంలో టీ-సాట్ ప్ర‌సారాలు మరియు టీ-సాట్ ఆధ్వర్యంలో మాక్ టెస్ట్

 


ఎస్ఎస్‌సీ ఉద్యోగ పోటీ పరీక్షల కోసం తెలుగు, ఆంగ్లంలో టీ-సాట్ ప్ర‌సారాలు మరియు టీ-సాట్ ఆధ్వర్యంలో మాక్ టెస్ట్ 

ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జరిగే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఉద్యోగ పోటీ పరీక్షల కోసం తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు పాఠ్యాంశాల ప్రసారాలు చేయనున్నట్లు సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి వెల్ల‌డించారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. జనవరి 25న లైవ్ ప్రసారాలతో ప్రారంభమై 27వ తేదీ నుండి ఏప్రిల్ 12వ తేదీ వరకు సాధారణ ప్రసారాలు కొనసాగించాలని నిర్ణయించిన‌ట్లు తెలిపారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా వివిధ స్థాయిల్లో నియామకం కోసం సుమారు 12,328 పోస్టుల‌కు నోటిఫికేషన్ విడుదల చేసింది. పరీక్షలు ఏప్రిల్ 12వ‌ తేదీ నుండి వారం రోజుల పాటు జరగనున్నట్లు బోర్డు ప్రకటించింది. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ 6,506, హయ్యర్ సెంకడరీ లెవెల్ 5,522 ఉద్యోగాలకు సంబంధించి గెజిటెడ్, నాన్ గెజిటెడ్, జూనియర్, సీనియర్ అసిస్టెంట్, డాటా ఎంట్రీ ఆపరేటర్స్ తదితర ఉద్యోగాల పోటీ పరీక్షలకు తాము అందించే పాఠ్యాంశాలు ఉపయోగపడతాయని సీఈవో  శైలేష్ రెడ్డి చెప్పారు. 

జనవరి 25న ప్రత్యేక ప్రత్యక్ష్య ప్రసారాలు :

పోటీ పరీక్షలపై అవగాహన కల్పించేందుకు అనుభవం కలిగిన సబ్జెక్టు నిపుణులచే ఈ నెల 25వ తేదీ సోమవారం రోజున ప్రత్యేక ప్రత్యక్ష్య ప్రసారాలు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రెండు గంటలు జరిగే లైవ్ లో సబ్జెక్టు నిపుణులతో పాటు సాంకేతిక నిపుణులు అందుబాటులో ఉంటారన్నారు. పరీక్షలు రాసేందుకు సిద్ధమయ్యే అభ్యర్థులు తమ సందేహాలను ఫోన్ ద్వారా 040-23540326, 23540726 టోల్ ఫ్రీ 1800 425 4039 నెంబర్లకు కాల్ చేయొచ్చ‌ని సూచించారు. 

జనవరి 27 నుండి నిపుణ ఛానల్ సాధారణ ప్రసారాలు :

జనరల్ ఇంగ్లీష్, ఇంటిలిజెన్స్, క్యాంటిటేటివ్ అప్టిట్యూట్, జనరల్ అవేర్ నెస్ అండ్ స్టాట్స్ కు సంబంధించిన ఐదు సబ్జెక్టుల్లో జనవరి 27వ తేదీ నుండి ఏప్రిల్ 12వ తేదీ వరకు ప్రసారాలుంటాయని తెలిపారు. వారంలో ఐదు రోజులు ఉదయం ఏడు గంటల నుండి 11 గంటల వరకు నాలుగు గంటల పాటు శని, ఆదివారాల్లో గత ఐదు రోజుల ప్రసారాలు కలిపి ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు, మధ్యాహ్నాం 3 గంటల నుండి ఎనిమిది గంటల వరకు పున: ప్రసారాలుంటాయన్నారు. పాఠ్యాంశాలు సుమారు 75 రోజుల పాటు 162 పాఠ్యాంశ భాగాలు 424 గంటలు ప్రసారాలు కొనసాగనున్నాయని సీఈవో వెల్ల‌డించారు. 

టీ-సాట్ ఆధ్వర్యంలో మాక్ టెస్ట్ : 

ఆధునిక టెక్నాలజీ  సహాయంతో ఎస్.ఎస్.సి పరీక్షలకు హాజరు కావాలనుకునే అభ్యర్థులకు మాక్ టెస్ట్ నిర్వహించాలని నిర్ణయించామన్నారు. పరీక్ష రాసే అభ్యర్థులకు ఫ్రీ ఫైనల్ లా తోడ్పటమే కాకుండా అభ్యర్థి సామర్థ్యాన్ని అంచనా వేసుకునే అవకాశం ఏర్పడనుందని సీఈవో తెలిపారు. 

టీ-సాట్ నెట్‌వ‌ర్క్ ప్రసారాలు

టీ-సాట్ నెట్‌వ‌ర్క్ ఛానళ్లు నిపుణ, విద్య తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులోకి వచ్చి రాష్ట్రంలో సుమారు 43 మంది కేబుల్ నెట్‌వ‌ర్క్ ఆపరేటర్లతో పాటు ఏయిర్‌టెల్ 948-949, టాటా స్కై 1479-1480, సన్ డైరెక్ట్ 195-196 నెంబర్లలో ప్రసారాలను అందిస్తున్నాయని సీఈవో తెలిపారు. వీటితో పాటు టీ-సాట్ యాప్ (tsat.tv), సోషల్ మీడియా facebook, twitter, instagram, youtube లలో చూడవచ్చన్నారు. పోటీ పరీక్షల అవగాహన ప్రసారాలతో ప్రయోజనం పొంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలంగాణ యువత భాగస్వామ్యాన్ని చాటాలని ఈ సంద‌ర్భంగా సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి అభ్య‌ర్థుల‌కు పిలుపునిచ్చారు.

T-SAT YouTube Channel

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags