Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Class 9, 10 And 11 Students to Be Promoted Without Exam

 

Tamil Nadu Class 9, 10 And 11 Students to Be Promoted Without Exam

ఈసారి కూడా 9,10,11 తరగతులకు వార్షిక పరీక్షలు రద్దు - పై తరగతులకు ప్రమోట్‌ 

9, 10, 11వ తరగతుల విద్యార్థులు పరీక్షలు లేకుండా పాస్ చేస్తామని తమిళనాడు సీఎం పళనిస్వామి అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు. 

తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. కరోనా నేపథ్యంలో ఈసారి కూడా వార్షిక పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 9, 10, 11వ తరగతుల విద్యార్థులు పరీక్షలు లేకుండా పాస్ చేస్తామని తమిళనాడు సీఎం పళనిస్వామి అసెంబ్లీ వేదికిగా ప్రకటించారు. వారందరి నేరుగా పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు వెల్లడించారు. 

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సీఎం పళని స్వామి తీపి కబురు చెప్పారు. రిటైర్మెంట్ వయసును 59 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రకటన చేశారు. సీఎం నిర్ణయంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభుత్వం జనరంజక నిర్ణయాలు తీసుకుంటోంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags