Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: కొవిడ్ రోగులకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా వైద్యం: సీఎం

 

AP: కొవిడ్ రోగులకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా వైద్యం: సీఎం

కరోనా వ్యాక్సినేషన్‌కు ఎలాంటి ఆటంకాలు లేకుండా అవసరాలకు సరిపడా డోసులను అందుబాటులో ఉంచుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. వైద్యారోగ్య శాఖలో నాడు-నేడు కార్యక్రమంపై సీఎం సమీక్షించారు. రాష్ట్రంలో కొవిడ్‌ నియంత్రణ, నివారణ, సంసిద్ధతపై ప్రధానంగా చర్చించారు.  నిత్యం సగటున 1.4 లక్షల మందికి టీకాలను వేస్తున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. ప్రస్తుతం తగినన్ని డోసులు లేవని.. కేవలం రెండు రోజులకు సరిపడా నిల్వలే అందుబాటులో ఉన్నాయని అధికారులు వివరించారు. స్పందించిన సీఎం.. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా సరిపడా టీకాలు వచ్చేలా చూడాలన్నారు. రోజుకు గ్రామీణ ప్రాంతాల్లో 4 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల మందికి టీకాలు వేయాలని ఆదేశించారు. కొవిడ్ చికిత్స పేరుతో ప్రైవేటు ఆస్పత్రుల్లో దోపిడీకి ఆస్కారం ఉండకూడదన్నారు. కొవిడ్‌ రోగులకు రూ.1 ఖర్చు లేకుండా చికిత్స అందించాలని స్పష్టం చేశారు.

మొన్నటివరకు వందల్లో ఉన్న కేసులు ప్రస్తుతం 2వేలకు పైగా చేరుకున్నాయి. దీంతో వ్యాక్సినేషన్ పంపిణీలో వేగం పెంచాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై ముందుగా ఫోకస్ పెట్టాలన్నారు. గ్రామాల్లో రోజుకు 4లక్షలు, అర్బన్‌ ప్రాంతాల్లో 2లక్షల డోసులు అందజేయాలన్నారు. వాక్సినేషన్‌ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు వాలంటీర్లు, ఆశావర్కర్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. కరోనా రోగులకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా వైద్యం అందించాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు.

Previous
Next Post »
0 Komentar