Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IGNOU OPENMAT, B.Ed. and BSc Nursing Entrance Exam on April 11 – Download Hall Tickets

 

IGNOU OPENMAT, B.Ed. and BSc Nursing Entrance Exam on April 11 Download Hall Tickets

ఈ నెల 11న ఇగ్నో ఎంబీఏ, బీఎస్సీ నర్సింగ్, బీఎడ్ ప్రవేశ పరీక్షలు - హాల్ టికెట్లు విడుదల

ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) ఎంబీఏ, బీఎస్సీ నర్సింగ్, బీఎడ్ ప్రవేశ పరీక్షలను ఏప్రిల్ 11న నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా 120 కేంద్రాల్లో 40,170 మంది విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షలకు హాజరుకానున్నారు. హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం నుంచి 462 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని ప్రాంతీయ కేంద్రం సంచాలకులు ఎస్.ఫయాజ్ అహ్మద్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వీరంతా నిజాం కళాశాలలో పరీక్ష రాయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. కంట్రోల్ నంబరు లేదా మొబైల్ నంబరు, పుట్టిన తేదీని ఉపయోగించి ఇగ్నో వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి నిర్ణీత సమయం కంటే 45 నిమిషాలు ముందు గానే చేరుకోవాలని చెప్పారు. ఇతర వివరాల కోసం 9492451812, 040-23117550 ఫోన్ నంబరులో సంప్రదించాలని సూచించారు. .

WEBSITE

DOWNLOAD HALL TICKETS

Previous
Next Post »
0 Komentar

Google Tags