Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: 10th Class and Inter First Year Examinations Cancelled and Inter 2nd Year Examinations Postponed

 

TS: 10th Class and Inter First Year Examinations Cancelled and Inter 2nd Year Examinations Postponed

తెలంగాణ: 10వ తరగతి మరియు ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు రద్దు – ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు వాయిదా

తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ఉద్ధృతి దృష్ట్యా రాష్ట్రంలో పరీక్షలను రద్దు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ ప్రకటించారు. ఎస్‌ఎస్‌ఈ బోర్డు నిర్ణయించే ఆబ్జెక్టివ్‌ విధానం ద్వారా ఫలితాలు వెల్లడిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఫలితాలపై ఎవరికైనా సంతృప్తి లేకపోతే పరీక్షలకు అవకాశమిస్తామని పేర్కొంది. పరిస్థితులు మెరుగయ్యాక పరీక్షలు రాసేందుకు అవకాశమిస్తామని వెల్లడించింది.

MEMO ON 10TH CLASS EXAMS CANCELLATION

మరోవైపు రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా ఇంటర్ మొదటి సంవత్సర విద్యార్థులను పరీక్షలు లేకుండానే రెండో సంవత్సరానికి ప్రమోట్ చేయాలని నిర్ణయించింది. ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. జూన్ మొదటి వారంలో సమీక్షించి రెండో సంవత్సరం పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.

MEMO ON INTER EXAMS CANCEL AND POSPONE

Previous
Next Post »
0 Komentar

Google Tags