Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS Covid-19 Media Bulletin 22-05-2021

 

TS Covid-19 Media Bulletin 22-05-2021

తెలంగాణలో 3,308 కొత్త కరోనా కేసులు

తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా మరోసారి 3వేలకు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 63,120మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, 3308మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొత్తగా 21మంది మృత్యువాతపడగా, 4723మంది కోలుకున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 513 కేసులు నమోదు కాగా.. ఆ తర్వాత ఖమ్మం, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో 200లకు పైగా కొత్త కేసులు వెలుగుచూశాయి. 

రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 1.44కోట్ల శాంపిల్స్‌ పరీక్షించగా, 5,51,035మందికి పాజిటివ్‌గా తేలింది.వీరిలో 5,04,970మంది కోలుకోగా.. 3106మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 42,959 క్రియాశీల కేసులు ఉన్నాయి. తెలంగాణలో రికవరీ రేటు 91.64శాతం ఉండగా.. మరణాల రేటు 0.56శాతంగా ఉంది.

TS Media Bulletin 22-05-2021 

Previous
Next Post »
0 Komentar

Google Tags